Switch to English

కరోనా కేసుల్లో హై‘ఢర్’బాద్..!

తెలంగాణలో కరోనా కేసులు దాదాపు అదుపులోకి వచ్చాయనుకుంటున్న తరుణంలో ఆ మహమ్మారి కన్నెర్రజేసింది. ఒక్కరోజే ఏకంగా 79 కేసులు నమోదు కావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణలో కేసులు వెలుగు చూడటం మొదలైన తర్వాత ఇంత తీవ్రస్థాయిలో పాజిటివ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు అత్యధికంగా ఒకేరోజు 75 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దానిని అధిగమించి 79 కేసులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిజానికి కరోనా కేసులు తెలంగాణలో తగ్గుముఖం పట్టాయి. 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తొలి నుంచీ మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు. ప్రస్తుతం కొత్తగా వచ్చే కేసులన్నీ హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి.

మొన్నటివరకు పది, పన్నెండు, 26.. ఇలా కేసులు నమోదుకాగా, తాజాగా ఒక్కసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు మూడు రోజులుగా దాదాపు వెయ్యి పరీక్షలు నిర్వహించడంతోనే కేసుల సంఖ్య పెరిగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే, ఇన్నాళ్లూ తాము తక్కువ పరీక్షలు చేసిన విషయాన్ని వారే అంగీకరించినట్టయింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ చాలా వెనకబడే ఉంది. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ వద్ద ప్రస్తావించినా.. తాము ఎవరికి పడితే వారికి పరీక్షలు చేయబోమని స్పష్టంచేశారు. మరోవైపు కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయినవారికి పరీక్షలు నిర్వహించొద్దని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసింది. ప్రస్తుతం దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది.

ఇక హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ, మద్యం షాపులు తెరవడంతో సమస్య తీవ్రత ఎక్కువైంది. మద్యం షాపులకు అనుమతి ఇచ్చే అంశాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగానే వ్యతిరేకించినట్టు సమాచారం. రెడ్ జోన్ లో ఉన్న హైదరాబాద్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కానీ రాష్ట్రం మొత్తంలో మద్యంపై ఎక్కువ ఆదాయం వచ్చేది హైదరాబాద్ నుంచే. పైగా ఇతర జిల్లాల్లో అనుమతి ఇచ్చి, హైదరాబాద్ లో ఇవ్వకుంటే మద్యం కోసం జిల్లా సరిహద్దులు దాటడానికి ప్రజలు ప్రయత్నిస్తారని భావించి.. రాష్ట్రం మొత్తం మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మద్యం కొనుగోలు కోసమంటూ భారీ స్థాయిలో జనాలు రోడ్డెక్కేశారు. దీంతో పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేస్తున్నాయంటే.. వాహనాలు ఎలా తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఫలితంగా ఇప్పటివరకు తగ్గుముఖం పట్టిందనుకుంటున్న కరోనా.. ఒక్కసారిగా జూలు విదిల్చినట్టయింది. ఇదే ఒరవడి కొనసాగితే హైదరాబాద్ లో కేసులు నమోదు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సీఎం కేసీఆర్ సైతం కరోనాతో కలిసి జీవించక తప్పదని మరోసారి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంటే రాబోయే కాలంలో కరోనాతో సావాసం చేయక తప్పదని ఆయన నిర్ధారణకు వచ్చేశారు. ఇక ప్రజలు ఆ దిశగా అప్రమత్తం కాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

ప్రభాస్‌ 21 : బాబోయ్‌ దీపిక అంత డిమాండ్‌ చేసిందా?

ప్రభాస్‌ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ప్రభాస్‌ 21వ...

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...

ఫ్లాష్ న్యూస్: ఎమ్మెల్సీ కొడుకుని అని గృహినికి టోకరా

భరత్ కుమార్ అనే వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకుని ఒక గృహిణిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసును ఘట్కేసర్ పోలీసులు నమోదు చేసి విచారణ...

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...