కోవిడ్ సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని.. ఇందుకు గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ఎంతో దోహదపడ్డాయని సీఎం జగన్ అన్నారు. దావోస్ లో వైద్యారోగ్య వ్యవస్థలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
‘ఏపీకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రులు లేవు. మండల, గ్రామ స్థాయిల్లో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ప్రాధమిక స్థాయిలో 44సార్లు ఇంటింటికీ వైద్యారోగ్య సర్వే చేశాం. అప్పట్లో దేశంతో పోలిస్తే ఏపీ మరణాల రేటు తక్కువగా 0.63 శాతం మాత్రమే’. నిధుల కొరత ఉన్నా 16వేల కోట్లను వైద్యారోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని నిర్ణయించాం..
‘ప్రస్తుతం 11గా ఉన్న మెడికల్ కాలేజీలతోపాటు.. మరో 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి వైద్యుల కొరత తీర్చాలని నిర్ణయించాం. కేంద్రం ఆయుష్మాన్ భారత్ లో 1000 చికిత్సలే ఉచితంగా అందుతుంటే.. తమ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా ద్వారా 2,446 వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం’ అని అన్నారు.