Switch to English

వీడిన మిస్టరీ..! సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ పాత్ర ఇదే: కాకినాడ ఎస్పీ

రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మిస్టరీ వీడింది. కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు. ‘సుబ్రహ్మణ్యం మృతిపై అతని తల్లి ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద కేసు నమోదు చేశాం. అనంతరం బంధువుల వాంగ్మూలం మేరకు హత్య కేసుగా నమోదు చేశాం. దర్యాప్తులో లభించిన ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశాం. జీజీహెచ్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాం. ఆరు బృందాలుగా గాలించి ఈరోజు అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నాం’ అని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

‘ఈనెల 19న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఆరోజు రాత్రి 8గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. 10గంటల సమయంలో రోడ్డుపైకి వస్తున్న సమయంలో అనంతబాబు అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యంను కారులో తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ తీసుకుని అనంతబాబు ఇంటి సమీపంలోకి వెళ్లారు. సుబ్రహ్మణ్యం పెళ్లికి అనంతబాబు చేసిన ఆర్ధికసాయం విషయంలో ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. అప్పటికే సుబ్రహ్మణ్యం కొంత చెల్లించి ఉన్నాడు. నువ్వింకా తాగుతూనే ఉన్నావ్. నిన్ను పనిలోకి తీసుకోవాలని మీ అమ్మ అడుగుతోంది. నీలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం.. సుబ్రహ్మణ్యంను అనంతబాబు కొట్టడం జరిగింది’.

‘ఎదురు ప్రశ్నించిన సుబ్రహ్మణ్యంను కోపంతో అనంతబాబు మెడపట్టి పక్కకు తోశాడు. దీంతో పక్కనే డ్రైనేజీ గట్టుపై పడ్డ సుబ్రహ్మణ్యం తలకు గట్టి దెబ్బ తగిలింది. మరోసారి సుబ్రహ్మణ్యం ఎదురు తిరగడంతో మళ్లీ తోయడంతో సుబ్రహ్మణ్యం తలకు మరోసారి గట్టి దెబ్బ తగిలింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించినా అప్పటికే సుబ్రహ్మణ్యంకు వెక్కిళ్లు రావడంతో తాగేందుకు నీరు ఇచ్చాడు. అయితే.. కొద్దిసేపటికే సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. గతంలో అనంతబాబు వద్ద పని చేసేటప్పుడు సుబ్రహ్మణ్యం అనేకసార్లు యాక్సిడెంట్ చేసిన ఘటనలు ఉన్నాయి. దీని ఆధారంగా హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని భావించాడు. రోడ్డు మీద కుదరకపోవడంతో సమీపంలోని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి అందుబాటులో ఉన్న తాళ్లు, కర్రలతో సుబ్రహ్మణ్యం ఒంటిపై బలమైన గాయాలయ్యేలా చేశారు’.

‘అర్ధరాత్రి 12.30 సమయంలో సుబ్రహ్మణ్యం తల్లికి ఫోన్ చేసి “సుబ్బుకు యాక్సిడెంట్ అయినట్టు నాకు ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. అక్కడికి రండి” అని అనంతబాబు చెప్పారు. అప్పటికే వైద్యులు మృతి చెందినట్టు ధ్రువీకరించడంతో కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి వారి ఇంటి వద్ద వదిలేశారు. అయితే.. గాయాలు యాక్సిడెంట్ లా లేవని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో సుమారు గంటకు పైగా వీరి మధ్య వాదనలు జరిగాయి. ఉదయం 4గంటలకు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ ప్రాధమిక దర్యాప్తు ద్వారా నిర్ధారణకు వచ్చిన వివరాలు’ అని ఎస్పీ తెలిపారు.

నిందితుడు అనంతబాబును భారీ బందోబస్తు మధ్య కాకినాడ ఏఆర్ కార్యాలయం నుంచి జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అనంతబాబును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

ఎక్కువ చదివినవి

నిస్సిగ్గు రాజకీయ నగ్నత్వం: కులాల కుంపటి తెరపైకి.!

‘బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్న మాట ప్రస్తావించకుండా వుండలేమేమో.. రాష్ట్రంలో రాజకీయాలు అంత ఛండాలంగా తయారయ్యాయ్..’ ఇదీ ఓ ప్రజాస్వామ్యవాది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భ్రష్టత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయం.! హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల...

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో “వారియర్” సంచలనం!!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో...

బర్త్‌డే స్పెషల్‌ : నీ దూకుడుకు సరిలేరు ఎవ్వరు

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంను పునికి పుచ్చుకున్న మహేష్‌ బాబు చిన్నప్పటి నుండే నటుడిగా వెండి తెర అరంగేట్రం చేశాడు. చిన్న వయసులోనే అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా పేరును దక్కించుకున్నాడు. స్కూల్...

బిగ్ బాస్ 6: ఈసారి మరింత డ్రామా అంటోన్న నాగ్

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే మొదలుకానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది. ఈ వీడియోలో నాగ్ వచ్చి ఈసారి మరింత డ్రామా అన్న సంకేతాలు...

రాశి ఫలాలు: మంగళవారం 09 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ ద్వాదశి మ.2:56 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: మూల ఉ.10:21 వరకు తదుపరి పూర్వాషాఢ యోగం:...