Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా వస్తుందంటే మెగాభిమానుల్లో ఉత్సాహం అనే డ్యామ్ కి గేట్లు ఎత్తినట్టే. దశాబ్దాలుగా చిరంజీవి (Chiranjeevi) సృష్టించుకున్న కంచుకోట అది. కొత్త అప్డేట్ ఇస్తేనే సంబరాలు చేసే మెగాఫ్యాన్స్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి మెగా సంబరాలు ఇవ్వడానికి మెగాస్టార్ రెడీ అయ్యారు.
ఆయన నటిస్తున్న భోళాశంకర్ (BholaShankar) సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. MEGA MUSIC MANIA of #BholaShankar కు అంతా సిద్ధం.. అతి త్వరలో భోళా మేనియా మోగబోతోంది అని అప్డేట్ ఇచ్చారు. దీనికి చిరంజీవి తనదైన స్టయిల్లో నడుస్తున్న ఫొటో ఫ్యాన్స్ కి కిక్కెక్కిస్తోంది. చిరంజీవి మరోసారి తన డ్యాన్స్ తో ప్రేక్షకులకు జోష్ ఇవ్వబోతున్నట్టుగా స్టిల్ ఉంది.
మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతంలో భోళాశంకర్ పాటలు రఫ్పాడేయటం పక్కా అని అభిమానులు అంటున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాతగా భోళాశంకర్ తెరకెక్కుతోంది. ఆగష్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమన్నా హీరోయిన్.
https://twitter.com/BholaaShankar/status/1663453488670715906?s=20