సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా బ్యాక్ టు బ్యాక్ ట్వీట్లు వేశాడు ఓ ప్రముఖ వెబ్ సైట్ మీద.! ఆ వెబ్ సైట్ అధినేత మీద, అందులో పనిచేసే ఓ జర్నలిస్టు మీదా బండ్ల గణేష్ వేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.
సినీ పరిశ్రమ ఆ వెబ్ సైట్‌ని బ్యాన్ చేయాలని కూడా బండ్ల గణేష్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అనూహ్యంగా ఆ జర్నలిస్టు, ట్విట్టర్‌కి గుడ్ బై చెప్పేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వెబ్సైట్లో వస్తోన్న కొన్ని కథనాల వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని అంతకు ముందు వాపోయాడు ఆ జర్నలిస్టు. తనలా ధైర్యంగా బయటకు వచ్చి ఆయా కథనాలు తామే రాసినట్లు ఒప్పుకోవాలంటూ ఆ జర్నలిస్టు డిమాండ్ కూడా చేసేశాడు.
ఇంతలోనే ఏమయ్యిందో, కొంతకాలం పాటు అందరికీ దూరంగా వుంటానంటూ ట్వీట్ పెట్టి, ఆ కాస్సేపటికే, ట్విట్టర్ హ్యాండిల్‌ని డీ యాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
సినీ పరిశ్రమపై అర్థం పర్థం లేని గాలి వార్తలతో విరుచుకుపడే ఆ వెబ్ సైట్ మీద గతంలో హీరో విజయ్ దేవరకొండ సీరియస్‌గా స్పందించాడు. చాలా ఏళ్ళ క్రితం మహేష్‌బాబు కూడా మండిపడ్డాడు.
మొన్నీమధ్యనే మహేష్‌బాబు మీద, అతని డెడికేషన్ మీదా ఓ గాలి వార్తని వండి వడ్డించింది ఆ వెబ్ సైట్. ‘రాసింది నేను కాదు, నా పేరుతో వున్న ఇంకొకరు..’ అంటూ ఆ జర్నలిస్టు బుకాయించే ప్రయత్నం కూడా చేశాడు. ఇంతకీ, ఈసారైనా ఈ జర్నలిస్టు నిజంగానే మాయమైపోయాడా.? అన్న డౌటానుమానాలు వస్తున్నాయ్ సినీ పరిశ్రమలో చాలామందికి.
ఆయనగారికి ఇలాంటి దోబూచులాటలు కొత్తేమీ కాదట. రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ నవ్వుకుంటూ వచ్చేస్తాడంటూ సినీ జర్నలిస్టు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
Poker88 menyambut baik semua pemain yang ingin bergabung bersama kami, baik itu pemain lama maupun pemain baru karena situs judi domino bet menyediakan daftar poker online gratis, Bagi anda pemain pemula jangan takut akan kekalahan.
Dewapoker merupakan salah satu situs slot online terpercaya dan teraman dengan keberuntungan besar bagi anda pecinta poker online. Di situs ini, anda mendapatkan banyak kemudahan, mulai dari bantuan pendaftaran, deposit yang tidak terlalu besar, bonus berlimpah dan banyak lainnya.