Switch to English

గాడ్‌ ఫాదర్ రివ్యూ : ఇంట్రెస్టింగ్‌ పొలిటికల్ డ్రామా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో ఇష్టపడి మలయాళ సూపర్ హిట్‌ మూవీ లూసీఫర్ ని గాడ్‌ ఫాదర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మెగా ఫ్యాన్స్ తో పాటు అందరి లో కూడా ఆసక్తి ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

నిజాయితీ గత సీఎం పీకేఆర్‌. ఆయన కూతురు సత్య ప్రియ(నయనతార) అల్లుడు జయదేవ్‌ (సత్యదేవ్‌). సీఎం పీకేఆర్‌ మరణంతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి సినిమా కథ సాగుతుంది. పీకేఆర్ అల్లుడు జయదేవ్‌ సీఎం పీఠంపై కన్నేస్తాడు. డ్రగ్స్ బిజినెస్ చేసే జయదేవ్‌ ని సీఎం పీఠంపై కూర్చోనివ్వద్దని పీకేఆర్ తనయుడు బ్రహ్మా(చిరంజీవి) నిర్ణయించుకుంటాడు. అందుకు బ్రహ్మ చేసిన పని ఏంటీ? ఇంతకు సీఎం పీకేఆర్‌, బ్రహ్మ మధ్య ఉన్న సంబంధం విషయంలో ఉన్న వివాదం ఏంటీ? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:

బ్రహ్మ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. కింగ్ మేకర్ పాత్ర ను చిరంజీవి అద్భుతంగా పోషించి మెప్పించాడు. గతంలో ఎప్పుడు చూడని విధంగా మెగా స్టార్‌ ను ఈ సినిమాలో కాస్త ఏజ్‌ ఎక్కువ అయిన వ్యక్తి పాత్రలో చూడటం అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. సినిమాలో మాస్ సాంగ్స్ లేకున్నా కూడా తన ఇమేజ్ తో చిరంజీవి సినిమాను పూర్తిగా తన భుజాలపై వేసుకుని మోశాడనే చెప్పాలి.

జయదేవ్‌ పాత్ర సత్యదేవ్‌ రక్తికట్టించాడు. ఇప్పటి వరకు హీరోగా మాత్రమే చేసిన సత్యదేవ్‌ మొదటి సారి నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర అవ్వడంతో ఎలా చేసి ఉంటాడా అంటూ అంతా ఆసక్తి కనబర్చాడు. అంతా ఆశించినట్లుగానే ఈ సినిమాలో ఆయన నటన చాలా బాగుంది. ఆకట్టుకునే బాడీలాంగ్వేజ్ తో ఆయన మెప్పించాడు. ఇక నయనతార సీరియస్ పాత్రలో నటించి మెప్పించింది. లేడీ సూపర్‌ స్టార్ స్థాయికి తగ్గ పాత్ర అనడంలో సందేహం లేదు. ఇతర పాత్రలో నటించిన వారు మెప్పించారు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు మోషన్ రాజా స్క్రిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రీమేక్‌ అయినా కూడా సాధ్యం అయినంత వరకు కొత్తగా ఉండేలా ప్రయత్నించాడు. ఒరిజినల్ స్టోరీ లైన్ మిస్ అవ్వకుండా ఆ ఫ్లేవర్‌ మిస్ అవ్వకుండానే చిరంజీవి కి తగ్గట్లుగా గాడ్‌ ఫాదర్‌ ని చేయడం జరిగింది. చిరంజీవి పాత్రను అద్భుతంగా రాసిన రాచయితలు గ్రేట్‌. సంగీతం కు పెద్దగా స్కోప్ లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ థమన్‌ అన్నట్లుగానే బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తమన్‌ ఒక మంచి బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఇక ఈ సినిమా ఎడిటింగ్‌ విషయంలో చిన్న చిన్న విషయాలు తప్ప అంతా బాగానే ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్ :

  • చిరంజీవి నటన,
  • సహ నటీ నటుల నటన,
  • సల్మాన్‌, చిరు సన్నివేశాలు
  • బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌
  • సెకండ్‌ హాఫ్‌

నెగటివ్ పాయింట్స్ :

  • వీఎఫ్‌ఎక్స్ వర్క్‌,
  • ఫస్ట్‌ హాఫ్‌ లో సాగతీత సన్నివేశాలు.

చివరిగా :

మాస్‌ పొలిటికల్‌ డ్రామాగా గాడ్‌ ఫాదర్‌ సాగింది. చిరంజీవి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్‌ చిరంజీవి నుండి ఏదైతే ఆశిస్తున్నారో అదే ఈ సినిమా ద్వారా దక్కుతుంది అనడంలో సందేహం లేదు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కాలమే సమాధానం చెప్పాలి.

తెలుగు బులెటిన్ రేటింగ్‌ : 3.25/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...