Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన చిరంజీవి ‘అడవి దొంగ’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమాని తన ఫైట్లు, డ్యాన్సులతో పరుగులు పెట్టించారు చిరంజీవి. దీంతోపాటే కమర్షియల్ లెక్కలనూ మార్చేశారు. తన సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్ లెక్కల్ని కొత్తగా రుచి చూపించారు. ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నిరంజన్ రెడ్డి.. ‘కోటి, రెండు, మూడు, నాలుగు, ఐదు కోట్ల కలెక్షన్లను మొదట పరిచయం చేసింది.. ధియేటర్లు పెరగడానికి.. ఎందరో సినిమా వ్యాపారం చేయడానికి చిరంజీవి సినిమాలు.. వాటి కలెక్షన్లే కారణం’ అని గుర్తు చేశారు. 80వ దశకంలో చిరంజీవి సినిమాల వసూళ్లు ఇలానే ఉండేవి. అలాంటి సినిమాల్లో చిరంజీవికి మరో కమర్షియల్ హిట్ ఇచ్చి సరికొత్త కలెక్షన్ల లెక్కల్ని రుచి చూపిన సినిమా ‘అడవిదొంగ’. క్యారెక్టర్ ఓరియంటెడ్ పాత్ర టార్జన్ గా చిరంజీవి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు.

టార్జన్ పాత్రలో..

అప్పటికే చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీకి వరంలా మారాయి. చిరంజీవి కోసం ప్రేక్షకులు ధియేటర్లకు క్యూలు కడుతున్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్లు, చిరంజీవి డేట్స్ ఇస్తారా అని నిర్మాతలు, అవకాశం ఇస్తారా అని ఎదురు చూసే దర్శకులు, చిరంజీవి చుట్టూ వాతావరణం ఇదే. ఆ సమయంలో పరుచూరి సోదరులు టార్జన్ బేస్డ్ కథను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లడం ఆయనకు కథ నచ్చి ఒప్పుకోవడం జరిగింది. చిరంజీవి డేట్స్ గోపీ ఆర్ట్ పిక్చర్స్ చలసాని గోపి సంపాదించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆ సమయంలో టాప్ మోస్ట్ క్రేజీ డైరక్టర్. అప్పటికే రేసుగుర్రంలా దూసుకెళ్తున్న చిరంజీవితో ఆయనకు ఇదే మొదటి బ్లాక్ బస్టర్ సినిమా. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

చిరంజీవి బర్త్ డే స్పెషల్స్: బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన చిరంజీవి ‘అడవి దొంగ’

సింహంతో ఫైట్ హైలైట్..

కథగా ఇది కూడా రివెంజ్ డ్రామానే. అడవిలో జంతువుల మధ్య టార్జన్ లా పెరిగిన వ్యక్తిని తల్లి గుర్తించి విద్యాబుద్ధులు నేర్పించి విలన్లపై ప్రతీకారం తీర్చుకునే కథ. అడవి దొంగగా చిరంజీవి మేకోవర్ అదిరిపోయింది. అడవి నేపథ్యంలో చిరంజీవిని చూసి చిన్న పిల్లలు కేరింతలు కొట్టారు. ఫైట్లతో ఫ్యాన్స్ ఊగిపోయారు. అడవిలో సింహంతో చిరంజీవి ఫైట్ సినిమాకే మేజర్ హైలైట్. చిరంజీవి హావభావాలు, రౌద్రం నిజంగా సింహంతో చిరంజీవి ఫైట్ చేసినట్టుగా.. ఇద్దరు సమఉజ్జీల పోరాటంగానే చూశారు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ చక్రవర్తి సంగీతం. ప్రతీపాట సూపర్ హిట్టే. పాటలు, చిరంజీవి డ్యాన్సులు ధియేటర్లను మోత మోగించేశాయి. పాటల స్పెషలిస్టు రాఘవేంద్రరావు చిత్రీకరణ.. చిరంజీవి-రాధ డ్యాన్సులు ప్రేక్షకులకు చక్కిలిగింతలే పెట్టాయి.

క్రేజీ కాంబినేషషన్ కు నాంది..

1985 నవంబర్ 19న విడుదలైన ఈ సినిమా అప్పటివరకూ చిరంజీవి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లకు అడవి దొంగ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. చిరంజీవికి తొలిసారిగా 31 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న సినిమాగా నిలిచింది. కలెక్షన్ తుఫాను సృష్టించిన ఈ సినిమా చెన్నై విజయా శేష్ మహాల్ లో శతదినోత్సవ సంబరం చేశారు. హిందీ లెజండరీ హీరో దిలీప్ కుమార్ ముఖ్య అతిధిగా వేడుకలు జరిపారు. ఈ సినిమా నుంచి చిరంజీవికి లక్కీ దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు కూడా చేరిపోయి ఆ తర్వాత ఎన్నో హిట్స్ కు అడవి దొంగతో నాంది పలికారు. చిరంజీవికి రాధ సరిజోడు అనేది మరోసారి అడవి దొంగ నిరూపించింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...