మెగాస్టార్ చిరంజీవి ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హిందీ సినిమాల తరహాలో ఇక్కడ కూడా వర్క్ షాప్ ఉండాలని చిరంజీవి అభిప్రాయపడ్డాడు.
ఆమిర్ ఖాన్ తన ప్రతీ సినిమాకూ వర్క్ షాప్ నిర్వహిస్తారు. షూటింగ్ కు వెళ్లే మూడు నెలల ముందే ఫుల్ స్క్రిప్ట్ తనకు ఇచ్చేయాలి. ఈ తరహా క్లారిటీ మనకూ ఉండాలని చెబుతూ తన దగ్గర సెట్స్ లో అప్పటికప్పుడు డైలాగ్స్ రాస్తుంటారు. సెట్స్ లో ఉదయం వేడి వేడి టిఫిన్స్ పెట్టాలి కానీ డైలాగ్స్ పెడతారు అని చమత్కరించాడు చిరంజీవి.
చిరు చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి కానీ అవి ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అని అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.