Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: విలనిజం అండ్ హీరోయిజం.. లక్ష్యసాధనకు చిరంజీవి వేసుకున్న బాటలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమాల్లో నటుడిగా స్థిరపడాలని వచ్చి అగ్ర నటుడిగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వెనుక చిరంజీవి ఎదురైన పరిస్థితులు కూడా ఓ కారణం. సోదరుడు నాగబాబు మాటల్లో.. ఫంక్షన్లో కుర్చీలో కూర్చున్న చిరంజీవిని అప్పటికే స్థిరపడిన ఓ నటుడు నుంచి ఎదురైన అనుభవం. అప్పుడే.. నటుడిగా కాదు.. అగ్రహీరోగానే ఎదగాలని చిరంజీవి నిర్దేశించుకున్నారని చెప్పారు. చెన్నైలో జోరు వానలో ఓ హీరో కటౌట్ కింద నిలబడి ఇలా నేనూ కటౌట్లు కట్టించుకునే స్థాయికి వెళ్లాలని అనుకోవడం. ఆ సంఘటనలే చిరంజీవి ఎదుగుదలకు మెట్లు అయ్యాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఆ కోవలో చేసినవే విలన్ పాత్రలు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్:  విలనిజం అండ్ హీరోయిజం.. లక్ష్యసాధనకు చిరంజీవి వేసుకున్న బాటలు

 

విలనిజం, శాడిజం.. 

కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి నలుగురిలో ఒకరిగా సినిమాలు చేశారు. ప్రధాన పాత్రలో నటించినవీ ఉన్నాయి. అయితే.. చిరంజీవికి బాగా గుర్తింపు తెచ్చినవి మాత్రం విలన్ పాత్రలే. తాయారమ్మ బంగారయ్య, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మోసగాడు, ఇది కథ కాదు, కొత్త అల్లుడు, పున్నమి నాగు, 47 రోజులు, న్యాయం కావాలి, రాణి కాసుల రంగమ్మ.. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. అప్పటికే ప్రాణం ఖరీదు, మనవూరి పాండవులు, పునాదిరాళ్లు వంటి అనేక సినిమాల్లో హీరో పాత్రలు చేసినా.. ఈ కుర్రాడు విలన్ పాత్రల్లో కూడా బాగా రాణిస్తున్నాడు అనేలా చేశాయి. దీంతో హీరో పాత్రలు చేస్తూనే విలనిజం ఛాయలున్న పాత్రలు చేశారు చిరంజీవి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్:  విలనిజం అండ్ హీరోయిజం.. లక్ష్యసాధనకు చిరంజీవి వేసుకున్న బాటలు

 

మహిళా ప్రేక్షకులే తిట్టుకునేలా..

ప్రేమ పేరుతో మోసం చేయడం, అమ్మాయి ప్రాధేయపడినా తనలోని క్రూరత్వం చూపడం, హీరోయిన్ ను చెరబట్టడం, పెళ్లి చేసుకున్న భార్యను విదేశాలకు తీసుకెళ్లి హింసించడం, భార్యను హింసించి చంపడం.. వంటి క్రూరమైన పాత్రల్లో చిరంజీవి నటించారు. విలన్ గా చేస్తే వాటికే పరిమితం అయిపోతానని ఆయన భావించలేదు. కారణం.. తనలో ఇదే కాకుండా హీరో మెటీరియల్ ఉంది.. తాను మెప్పించగలననే నమ్మకమే ఆయన్ను ముందుకు నడిపించింది. అందుకే.. విలనిజం ఉన్న పాత్రల్లో ఎంత వైవిధ్యం చూపారో.. హీరోగా చేసిన సినిమాల్లో.. ‘విలన్ గా చేసిన ఆ చిరంజీవేనా’ అనిపించేలా చేశారు. విలన్ గా చిరంజీవిని తిట్టుకున్న ప్రేక్షకులే ఆయన హీరోగా చేసే సినిమా కోసం పరితపించేలా చేశారు. హీరోల చేతుల్లో తన్నులు తినే పాత్రలు కాకుండా.. ఏకంగా మహిళా ప్రేక్షకులు తిట్టుకునే పాత్రలే చేసి మెప్పించారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్:  విలనిజం అండ్ హీరోయిజం.. లక్ష్యసాధనకు చిరంజీవి వేసుకున్న బాటలు

 

చిరంజీవి నట విశ్వరూపం..

న్యాయం కావాలిలో రాధికను ప్రేమించి, మోసం చేసి వేరొకరిని పెళ్లి చేసుకునే పాత్రలో నటించారు చిరంజీవి. రాధిక తన న్యాయపోరాటంలో చిరంజీవిని దోషిగా నిలబెడుతుంది. సినిమాలో ప్రేమికుడిగా, మోసగాడిగా, దోషిగా విభిన్న పార్శ్వాల్లో చిరంజీవి నటించారు. కేసులో ఓడినా పురుషాహంకారం చూపే చిరంజీవి (పాత్ర)ని నాడు తిట్టుకోని మహిళా ప్రేక్షకులు లేరు. తాయారమ్మ-బంగారయ్య క్లైమాక్స్ లో కేవలం రెండు నిమిషాల పాత్రలో చిరంజీవి చూపించే క్రూరత్వం ఆయనలోని ప్రతిభకు నిదర్శనం. మోసగాడులో శ్రీదేవిని చెరబట్టే సన్నివేశమైనా, 47 రోజుల్లో జయప్రదపై శాడిజం చూపిన పాత్రలోనైనా ఆయన నటన అద్భుతం. అవే చిరంజీవిని పరిశ్రమకు దగ్గరి వాడిని చేసాయి. ఆక్రమంలో వచ్చిన హీరో పాత్రలు చిరంజీవి నట విశ్వరూపం చూపేందుకు బాటలు పరిచాయి.

విలనిజం అండ్ హీరోయిజం.. లక్ష్యసాధనకు చిరంజీవి వేసుకున్న బాటలు

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...