విరాట్ కోహ్లీ చిరంజీవి పాటలకు స్టెప్పులు వేసేవాడంట తెలుసా? ఈ విషయం చెప్పింది మన తెలుగు క్రికెటర్ రవితేజ. రీసెంట్ గా విరాట్ కోహ్లీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అండర్ 15 జట్టులో తామిద్దరం రూమ్ మేట్స్ అని తెలిపాడు. అలాగే అప్పట్లో తాను చిరంజీవి సాంగ్స్ ఎక్కువగా చూసేవాడినని, విరాట్ కోహ్లీ ఆ సాంగ్స్ కు డ్యాన్సులు వేసేవాడని రవితేజ చెప్పాడు.
అప్పటినుండి ఒకరినొకరం చిరు అని పిలుచుకోవడం అలవాటైందని వెల్లడించాడు. అంతే కాదు ఆరేళ్ళ తర్వాత కూడా తనను కలిసాక ఎలా ఉన్నావు చిరు అంటూ ఆప్యాయంగా పలకరించాడని తెలిపాడు.
ఇది విన్న మెగా అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు. నిజమే మరి అప్పట్లో చిరు డ్యాన్సులకు తెలుగు రాష్ట్రాలను దాటి అభిమానులు ఉండేవారు. అందులో దేశం గర్వించదగ్గ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఉండటం నిజంగా సంతోషించే విషయమే కదా.
824140 75742I got what you intend,bookmarked , extremely nice internet site . 578466
986931 611443hi there, your website is discount. Me thank you for do the job 523517