Switch to English

వెన్నుపోటు తప్పు కాదని బాలయ్యతో చెప్పించేసిన చంద్రబాబు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయ ఘనతల గురించి ప్రచారం చేసుకోవడానికి ఓ వేదికగా ‘ఆహా’ ఓటీటీని వాడుకున్నట్లు అనిపిస్తోంది. సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ రెండో సీజన్, ఎక్కువగా రాజకీయ పరమమైన అంశాల గురించి, అందునా చంద్రబాబుకి ఎలివేషన్ ఇచ్చేందుకోసమే అన్నట్లుగా తయారైంది.

ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, సైబరాబాద్ నిర్మాణం.. ఇలాంటి అంశాలపై తెలుగు ప్రజలకు ‘పచ్చ సంకేతం’ ఇచ్చే దిశగానే టాక్ షో నడవడం గమనార్హం. ‘ఇండియాలో రాజకీయంగా టాలెస్ట్ లీడర్స్‌లో ఒకరు చంద్రబాబు..’ అంటూ ఎంట్రీలోనే నందమూరి బాలకృష్ణ తన బావ, తమ పార్టీ అధినేతకు ఎలివేషన్స్ ఇచ్చేసుకున్నారు.

చంద్రబాబు యుక్త వయసులో వున్నప్పుడు చేసిన చిలిపి చేష్టలు, నారా లోకేష్ స్టూడెంట్‌గా వున్నప్పుడు అమ్మాయిలతో పార్టీ చేసుకోవడం.. ఇలాంటి అంశాలూ చర్చకు వచ్చాయ్. ‘మీరు సినిమాల్లో చేస్తారు, నేను నిజ జీవితంలోనే యువకుడిగా వున్నప్పుడు చేశాను..’ అని చంద్రబాబు తనలోని రొమాంటిక్ యాంగిల్‌ని బయటపెట్టారు.

ఆద్యంతం ‘బావా.. బావా..’ అంటూ బాలకృష్ణ, చంద్రబాబుని సంబోదించడం గమనార్హం. బావని బావ.. అనే పిలవాలి మరి.! అల్లుడి విషయంలోనూ బాలయ్య ఒకింత ముచ్చటగా ప్రశ్నలు సంధించి, అంతకంటే ముచ్చటైన సమాధానాల్ని రాబట్టుకున్నారు. స్వర్గీయ ఎన్టీయార్ గురించి పొగడ్తలు.. అవన్నీ మామూలే.

ఇక, ఈ షో మొత్తానికీ హైలైట్ విషయమేంటంటే, స్వర్గీయ ఎన్టీయార్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న వ్యవహారంపై, ‘అది తప్పా.?’ అని చంద్రబాబు అడగడం, ‘తప్పు కాదు’ అని బాలకృష్ణ చెప్పడం.! ఒకటికి రెండు సార్లు అడిగారు చంద్రబాబు ‘అది తప్పా.?’ అని. మొదట ‘ఔను’ అని చెప్పకుండా బాలకృష్ణ, వేరే టాపిక్‌లోకి వెళితే, చంద్రబాబు కల్పించుకుని మళ్ళీ, ఆ ‘వెన్నుపోటు టాపిక్’ తీసుకొచ్చారు.

‘ఆరోజు కాళ్ళు పట్టుకుని బతిమాలాను. రెండున్నర గంటలు ఆయనతో మాట్లాడి ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆయన రాముడు, నేను హనుమంతుడిని. రాముడు కావాలా.. రాముడు చూపిన బాటలో నడవాలా.? అన్న సందిగ్ధం వచ్చినప్పుడు రాముడు చూపిన బాటనే ఎంచుకున్నాను..’ అని చంద్రబాబు చెప్పడం కొసమెరుపు.

ఎన్టీయార్, వాజపేయి లాంటి మేటి రాజకీయ నాయకుల సరసన తన పేరుని చేర్చుకున్న చంద్రబాబు, పనిలో పనిగా నరేంద్ర మోడీ పేరుని కూడా ప్రస్తావించడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...