యంగ్ హీరో నిఖిల్, సూర్య ప్రతాప్‌ల కాంబినేషన్లో 18 పేజెస్ అనే చిత్రం నిన్న లాంచ్ అయిన విషయం తెల్సిందే. జీఏ2 బ్యానర్లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షూటింగ్ ప్రారంభోత్సవంకు అల్లు అరవింద్ మనవరాలు అల్లు అర్హాతో కలిసి వచ్చాడు. అల్లు అర్హా మొదటి షాట్‌కు క్లాప్ కొట్టడం జరిగింది. అల్లు అర్హాతో నిఖిల్ ఒక వీడియో తీసుకుని తన సినిమా ఓపెనింగ్‌కు అర్హా చీప్ గెస్ట్ అంటూ పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అల్లు అర్జున్ ఆ వీడియోకు స్పందించాడు. నిఖిల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన బన్నీ తన కూతురు అల్లు అర్హా అప్పుడే చీఫ్ గెస్ట్‌గా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఇంత చిన్న వయసులో కూతురు అర్హా చీఫ్ గెస్ట్‌గా నిలవడం పట్ల బన్నీ ఒకింత అసూయను కూడా కనబర్చాడు. తాను ఒక సినిమా ముహూర్తంకు చీఫ్ గెస్ట్‌గా మారేందుకు 23 ఏళ్లు పట్టింది. కాని అర్హా మాత్రం ఇంత చిన్న వయసులోనే చీఫ్ గెస్ట్ అయ్యిందని ఆనందం వ్యక్తం చేశాడు.
సోషల్ మీడియాలో అర్హా సెన్షేషన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాములో రాముల పాట డాన్స్‌ను దోశ స్టెప్ అన్న అర్హా ఇటీవల తండ్రిని బే అంటూ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి నిఖిల్ సినిమా ఓపెనింగ్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరు అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముందు ముందు ఈ అమ్మాయి మరెన్ని సెన్షేషనల్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
All the Best for the new Movie @actor_Nikhil . N Arha is lucky to be the chief guest at this age … it’s took me 23 years of age to be chief guest at a muhurtam 😂 https://t.co/YUzxSU8DQe
— Allu Arjun (@alluarjun) March 5, 2020