పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ నుండి మొదటి పాట రాబోతుంది. మహిళ దినోత్సవం సందర్బంగా ఈ సినిమాలోని మగువా మగువా అనే పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మహిళల గొప్పతనంను తెలియజేసే విధంగా సినిమా ఉంటుందనే విషయం తెల్సిందే. ఇక ఈ పాటలో కూడా ఆడవారి గురించిన విషయాలను ప్రస్థావిస్తూ లిరిక్స్ ఉంటాయని సమాచారం అందుతోంది. థమన్ సంగీతంలో ఈ పాట రెడీ అయ్యింది.
ఈమద్య కాలంలో తెలుగు శ్రోతలను తెగ ఆకట్టుకుంటున్న సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడటంతో జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాట ప్రోమోతోనే ఆకట్టుకున్న మేకర్స్ పూర్తి పాటతో సెన్షేషన్ క్రియేట్ చేస్తాడేమో అంటున్నారు. కమర్షియల్ సినిమా కాకపోవడంతో ఈ సినిమా పాటలు ఎక్కువ ఉండవట. ఈ పాటతో పాటు మరో ప్రమోషనల్ సాంగ్ మాత్రమే ఉంటుందని సమాచారం అందుతోంది.
బాలీవుడ్ పింక్ మూవీకి ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. దిల్‌రాజు బ్యానర్లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రను నివేధా థామస్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నెలలో షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను మే రెండవ లేదా మూడవ వారంలో విడుదల చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. పవన్ ఫస్ట్‌లుక్ తాజాగా విడుదల అవ్వగా ఏ స్థాయిలో స్పందన వచ్చిందో తెల్సిందే.
362817 236355I think this site contains some extremely very good info for everybody : D. 254087
278323 432621Right after examine a couple of of the weblog posts on your internet internet site now, and I genuinely like your manner of blogging. I bookmarked it to my bookmark website record and will probably be checking back soon. Pls take a appear at my web page as effectively and let me know what you feel. 162000
764863 539695You produced some decent points there. I looked online for your issue and located a lot of people will go together with with the internet site. 104129