Switch to English

తెలుగింటి కోడలి బడ్జెట్‌ ఎలా వుందంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

నిర్మలా సీతారామన్‌.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.. ఉన్నత విద్యావంతురాలు. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణగల కార్యకర్త. ఆమె వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానం, పార్టీ పట్ల ఆమెకున్న అంకిత భావం.. ఇలా ఇవన్నీ ఆమెను కేంద్ర ఆర్థిక మంత్రిని చేశాయి. గతంలో ఆమె కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన విషయం విదితమే. ఆమె తమిళనాడుకి చెందిన వ్యక్తి అయినా, తెలుగింటి కోడలు. అచ్చ తెలుగులో చాలా స్వచ్ఛంగా మాట్లాడగలరామె. ఓ మహిళ ఆర్థిక శాఖ మంత్రిగా, బడ్జెట్‌ని ప్రవేశ పెట్టడమంటే, ఆ బడ్జెట్‌పై సాటి మహిళా లోకంపై అంచనాలు వుండడం సహజమే. కానీ, ఆమె దేశానికి ఆర్థిక మంత్రి. దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి. ఇంతకీ, నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎలా వుంది.? మహిళలకు అదనపు వరాలు ఏమైనా ఇచ్చారా.? సామాన్యుడికి ఉపశమనమెంత.? ఇలా సవాలక్ష ప్రశ్నలు సామాన్యుల మెదళ్ళలో వుండడం సహజమే.

కానీ, చాచి కొట్టి.. ఆ తర్వాత చెంప మీద చల్లటి నీళ్ళతో తడిమినట్లు.. దేశ బడ్జెట్‌ వుండడం కొత్తేమీ కాదు. ఇప్పుడూ అదే జరుగుతుందని జనం అంచనా వేశారు, అఫ్‌కోర్స్‌.. అదే జరిగిందనుకోండి.. అది వేరే విషయం. బడ్జెట్‌లో సామాన్యుడికి ఊరట గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఆ మాటకొస్తే, చాచి కొట్టారు.. ఉపశమనం మాత్రం లేకుండా పోయింది. ఇంటి రుణాలపై వడ్డీ రాయితీని 2 లక్షల నుంచి మూడున్నర లక్షలకు పెంచడం ఊరటే. కానీ, ఇంటి నిర్మాణంలో ఉపయోగించే పీవీసీ పైపుల దగ్గర్నుంచి, చాలా ఉత్పత్తులపై పన్నుని గణనీయంగా పెంచేశారు.

ఈ ఏడాదిలో పెట్రో ధరలు తగ్గుతాయని కేంద్రం రెండ్రోజుల క్రితమే ప్రకటించింది. ఆ తగ్గుదల సామాన్యుడి జేబుకి అందకుండా అదనపు సెస్‌ విధించింది నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే వున్నాయి. భారతదేశంలో మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారమే. కానీ, ఆ బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెరిగింది. సో, బంగారం ధర పెరగనుందన్నమాట.

స్వయం సహాయక సంఘాల్లో వున్న మహిళలకు ముద్ర రుణాల్ని వర్తింపజేయడం ఉపశమనం కిందే భావించాలి. ఊరట తక్కువ, బాదుడు చాలా ఎక్కువ.. అన్నట్లుంది నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌. దేశమంతా, బడ్జెట్‌ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తోంటే, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ‘అద్భుతమైన బడ్జెట్‌’ అంటూ కితాబులిచ్చేశారు. ఆయనగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గనుక.. బహు గొప్పగానే వుంటుంది.

ఎయిర్‌ ఇండియాలో వాటాలు తగ్గించుకోవడం ద్వారా ఆ సంస్థ భవిష్యత్తుని కేంద్రం ప్రశ్నార్థకం చేయబోతోంది. మొత్తంగా చూస్తే, దేశ బడ్జెట్‌ సామాన్యుడికి సమస్యలు తెచ్చేలా వుంది తప్ప, సమస్యల నుంచి బయటపడేసేలా లేదన్నది మాత్రం నిర్వివాదాంశం. ఉద్యోగ కల్పనకు గానీ, పారిశ్రామికీకరణకుగానీ ఏమాత్రం ఊతమిచ్చే బడ్జెట్‌ కానే కాదని ఆయా రంగాలకు చెందిన నిపుణులూ అభిప్రాయపడ్తుండడం కొసమెరుపు. మామూలుగా అయితే, బడ్జెట్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లు ఊపందుకోవడం ఈ మధ్య చూస్తున్నాం. కానీ, ఇప్పుడు అనూహ్యంగా స్టాక్‌మార్కెట్లను సైతం బడ్జెట్‌ మెప్పించలేకోపోయింది. సూచీలన్నీ నేలచూపులు చూసేస్తున్నాయ్‌.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...