Switch to English

సినిమా రివ్యూ : ఓ బేబీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

నటీనటులు : సమంత, లక్ష్మి, నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, జగపతి బాబు, ప్రగతి తదితరులు ..
రేటింగ్ : 2. 5 / 5
సంగీతం : మిక్కీ జె మేయర్
కెమెరా : రిచర్డ్ ప్రసాద్
మాటలు : లక్ష్మి భూపాల్
నిర్మాతలు : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా
దర్శకత్వం : నందిని రెడ్డి

చాలా కొరియన్ సినిమాలను కాపీ కొట్టొ, ఇన్స్పైర్ గా తీసుకునో తెలుగు సినిమాలు తీయడం మనం ఇప్పటికే చాలా చూసేసాం. కానీ మొదటి సారి ఓ కొరియన్ సినిమాను డైరెక్ట్ గా రీమేక్ చేయడం విశేషం. మిస్ గ్రానీ పేరుతొ కొరియాన్ భాషలో విడుదలైన ఆ సినిమా సంచలన విజయం సాధించి పలు భాషల్లో రీమేక్ అయింది. దాన్ని తెలుగులో సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ గా తెరకెక్కించారు. మరి ఈ సినిమాలో ఓ బేబీ గా సమంత ఎం చేసిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

చిన్నవయసులోనే పెళ్లి జరగడం .. యుక్త వయసులోకి రాగానే భర్త చనిపోవడం ..జీవితంలో ఏ హ్యాపీ నెస్ ను చూడకుండా ముసలితనం వచ్చేస్తుంది ఆమెకు ( లక్ష్మి ). పెద్ద వయసు .. దానికి తోడు పిల్లలతో అల్లరి చేయడం లాంటి సంఘటనలతో ఆమెను ఇక్కడే ఉంచితే పిల్లలు పాడవుతారు అని ఆమెను ఓ వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. దాంతో ఆమె మనసు గాయపడింది. ఆమెలో మధనం మొదలవుతుంది. జీవితంలో ఏ ఆనందాన్ని చూడకుండా ఉన్న తనను ఇలా వృద్ధాశ్రమంలో అనాధల పడేశారని ఫీల్ అవుతుంది. అయితే యుక్త వయసులో తాను ఎలా ఉండాలో ఆ కలను నిజం చేసే అవకాశం జగపతి బాబు ద్వారా వస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న లక్ష్మి యుక్త వయసులోకి మారిపోతుంది ( సమంత)? యుక్త వయసులోకి మారిన లక్ష్మి తన కలలు ఎలా నెరవేర్చుకుంది. ఆ క్రమంలో ఆమె పడ్డ కష్టాలు ఏమిటి అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ ;

జీవితంలో ఏ ఆనందాన్ని చూడకుండానే .. ముగిసిపోతుందేమో అంటూ మదనపడే పాత్రలో సీనియర్ నటి లక్ష్మి బాగాచేసింది . నిజంగా ఆమెకు తగ్గ పాత్ర ఇది. ఏ వయసులో ఆ ముచ్చట తీర్చుకుంటేనే జీవితం అంటూ లక్ష్మి చెప్పే సందేశాలు బాగున్నాయి. ఇక యుక్త వయసులో లక్ష్మి గా మరీన పాత్రలో సమంత అల్లరి సూపర్. సమంత తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కామెడీ, ఎమోషన్, అన్ని చక్కగా చేసి మెప్పించింది. ఇక లక్ష్మి చిన్ననాటి స్నేహితుడిగా రాజేంద్ర ప్రసాద్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏమిలేదు. రాజేంద్ర ప్రసాద్ అల్లరితో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రల్లో రావు రమేష్, తేజు, జగపతి బాబులు బాగా చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

కొరియర్ సినిమాకు రీమేక్ అయినా కూడా తెలుగు నేటివిటీ తెచ్చే ప్రయత్నంలో దర్శకురాలు నందిని రెడ్డి ప్రయత్నం బాగుంది. నందిని సినిమాలంటే కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఈ సినిమాకు అదే ఫ్లేవర్ తెచ్చే ప్రయత్నం చేసింది. ఆసక్తి కలిగించే సన్నివేశాలు, స్క్రీన్ ప్లే బాగుంది. అయితే సెకండాఫ్ మాత్రం చాలా నీరసంగా సాగడం కొంత బోర్ కొట్టిస్తుంది. ఇక మిక్కీ జె మేయర్ సంగీతం బాగుంది. రిచర్డ్ ప్రసాదం ఫోటోగ్రఫి కి పేరు పెట్టేది ఏమి లేదు. ప్రతి ఫ్రెమ్ ను రిచ్ గా చేసే ప్రయత్నాలు చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లక్ష్మి భూపాల్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. మొత్తంగా నందిని రెడ్డి మేకింగ్ విషయంలో బాగానే కేర్ తీసుకున్నా అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు, సెకండాఫ్ స్లోగా సాగడం వంటివి నిరాశ పరిచే అంశాలు.

విశ్లేషణ :

మిస్ గ్రానీ అనే కొరియన్ కథతో చేసిన ఈ రీమేక్ గురించి చెప్పాలంటే .. తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు బాగానే చేసినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. పక్కా ఎంటర్ టైనింగ్ వె లో తీర్చిదిద్దిన ఈ కథలోకి వెళితే .. వయసు ఉన్నప్పుడు ఎదో చేయాలనీ అనుకుంటాం .. కానీ ఎదో పనుల్లో పడి ఏ పని చేయలేక వయసు జారిపోతుంది. అయ్యో వయసు ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయాము అన్న ఫీలింగ్ ఉన్న ఓ మహిళ జీవితంలో అనుకోకుండా వయసు తరిగిపోయి మళ్ళీ యుక్త వయసులోకి వస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ కథ. ఫస్ట్ హాఫ్ హాయిగా జరిగిపోయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టించింది. స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సెంటిమెంట్ విషయంలో కూడా కామెడీని మిక్స్ చేయడం బాగాలేదు. ఎమోషన్స్, కామెడీ, సమంత, లక్ష్మి ల నటన, రాజేంద్ర ప్రసాద్ కామెడీ ఆకట్టుకునే అంశాలు.

ట్యాగ్ లైన్ : ఈ బేబీ .. ఓ రోలర్ కోస్టర్

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...