Switch to English

ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలలో ఇదే ఉత్తమ చిత్రం: ‘బ్రో’ చిత్ర దర్శకుడు సముద్రఖని

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన దర్శకుడు సముద్రఖని, బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఒక చిన్న ఆర్టిస్ట్ గా మొదలై, ఇప్పుడు పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మీ ప్రయాణం గురించి చెప్పండి?

నేను ఏదీ ప్లాన్ చేయలేదు. దర్శకుడిగా ఇది నా 15 వ సినిమా. ఈ 15 సినిమాలకు నేనేది ప్లాన్ చేయలేదు. 1994 లో అసిస్టెంట్ డైరెక్టర్ గా నా ప్రయాణం మొదలైంది. అప్పటినుంచి నా పని నేను చూసుకుంటూ, జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాను. బుల్లితెర మీద నా ప్రతిభ చూసి ఎస్.పి. చరణ్ గారు నాకు మొదటి సినిమా అవకాశమిచ్చారు. మన పని మనం సరిగ్గా చేస్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. వచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.

రీమేక్ చేయడానికి కారణం?

ఈ కథని అన్ని భాషలకు చేరువ చేయాలి. 12 భాషల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. వినోదయ సిత్తం చేయకముందు, తర్వాత ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. వినోదయ సిత్తం చేశాక జీవితంలో సగం సాధించామనే భావన కలిగింది. ఇక ఇప్పుడు బ్రో చేశాక ఇంతకంటే సాధించడానికి ఏంలేదు, ఇప్పటినుంచి జీవితంలో వచ్చేదంతా బోనస్ అనిపిస్తుంది.

పవన్ కళ్యణ్ గారు లాంటి బిగ్ స్టార్ తో సినిమా అంటే ఏమైనా ఆందోళన చెందారా?

అవన్నీ ఏం ఆలోచించలేదు. కాలమే అన్నీ నిర్ణయిస్తుంది. అప్పటికి వినోదయ సిత్తం విడుదలై పది రోజులే అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి, నా ఫోన్ నెంబర్ సంపాదించి మరీ నాతో మాట్లాడారు. అంతలా మనుషులను ప్రభావితం చేసే చిత్రమిది. త్రివిక్రమ్ అన్నయ్య సహకారంతో ఇక్కడ ఈ సినిమా చేయగలిగాను. నేను సినిమా కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ సంభాషణలు ఆయనకు బాగా నచ్చాయి. తమిళ్ లో చేసినప్పుడు కోవిడ్ సమయం కావడంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో నేనే నటించాను అని చెప్పాను. ఈ కథని ఎక్కువ మందికి చేరువ చెయ్యాలని, కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారు చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అలా కళ్యాణ్ గారికి కథ నచ్చడంతో వెంటనే సినిమా పని మొదలైంది. కాలమే త్రివిక్రమ్ గారిని, కళ్యాణ్ గారిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది.

ఈ సినిమాకి స్ఫూర్తి ఏంటి?

మా గురువు గారు బాలచందర్ గారితో కలిసి 2004 సమయంలో ఒక డ్రామా చూశాను. ఎలా ఉందని గురువుగారు అడిగితే, బాగుంది సార్ కానీ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తే బాగుంటుంది అన్నాను. అప్పటినుంచి ఆ కథ నాతో పయనిస్తూనే ఉంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని 17 ఏళ్ళ తర్వాత సినిమాగా తీశాను. అదే వినోదయ సిత్తం. ఆ స్టేజ్ ప్లే రచయిత డబ్బు ఇస్తానన్నా తీసుకోలేదు. సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని ప్లాన్ చేస్తే, సమాజం మనకి మంచి చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది.

మార్పులు చేయడం వల్ల మాతృక స్థాయిలో బ్రో ప్రేక్షకులకు అనుభూతిని పంచగలదు అనుకుంటున్నారా?

ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. మాతృకలోని ఆత్మని తీసుకొని పవన్ కళ్యాణ్ గారి స్టార్డం కి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం. మాతృక కంటే గొప్పగా ఉంటుంది బ్రో.

మీరు రచయిత అయ్యుండి త్రివిక్రమ్ గారి సహకారం తీసుకోవడానికి కారణం?

నేను సమిష్టి కృషిని నమ్ముతాను. ఇక్కడ నేటివిటీ మీద త్రివిక్రమ్ గారికి ఉన్న పట్టు నాకుండదు. పైగా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించడం నాకే ఆశ్చర్యం కలిగించింది. నేను ఆయనతో అల వైకుంఠపురములో నుంచి ట్రావెల్ అవుతున్నాను. కానీ ఆయనకు సునీల్ వల్ల నా గురించి ముందే తెలిసింది. శంభో శివ శంభో సమయంలో నా గురించి సునీల్ చెప్పేవారట. అలా దర్శకుడిగా త్రివిక్రమ్ నన్ను ముందు నుంచే నమ్మారు.

విజువల్ గా ఎలా ఉండబోతుంది?

విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఇది 53 రోజుల్లో చేశాం. కానీ విజువల్స్ చూస్తుంటే చాలా రోజులు చేసినట్లు ఉంటుంది. 53 రోజులు ఒక్క సెకన్ కూడా వృధా చేయకుండా పనిచేశాం. 150 రోజులు షూట్ చేసిన సినిమాలా అవుట్ పుట్ ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన 15 సినిమాల్లో ఇదే నా బెస్ట్ మూవీ. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ అన్నయ్య నాకు ఒక తండ్రిలా అండగా నిలబడ్డారు.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ ఎలా ఉండబోతుంది?

వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మనం ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదు. కెమెరా పెడితే చాలు, వాళ్ళు స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేస్తారు.

పవన్ కళ్యాణ్ గారి గురించి?

పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయన షాక్ అయ్యారు. అలా ఆయనను కలిసిన మూడు రోజులకే షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆయన సెట్ లో అడుగుపెట్టగానే మొదట ఏం జరుగుతుందోనని మొత్తం గమనిస్తారు. దర్శకుడిగా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది. ఆయన ఈ సినిమా కోసం ఎంతో చేశారు. సమయం వృధా చేయకూడదని సెట్ లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు. ఎంతో నిష్ఠతో పనిచేశారు.

థమన్ సంగీతం గురించి?

థమన్ గురించి చెప్పాలంటే చెబుతూనే ఉండాలి. నేను తీసిన ఈ 15 సినిమాలలో మొదటిసారి థమన్ నేపథ్యం సంగీతం విని కంటతడి పెట్టుకున్నాను.

నిర్మాతల గురించి?

ఈ సినిమా విషయంలో నిర్మాతల సహకారం అసలు మర్చిపోలేను. సినిమాకి ఏది కావాలంటే అది సమకూర్చారు. వాళ్ళు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...