Oppenheimer: హాలీవుడ్ (Hollywood) రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ఓపెన్ హైమర్’ (Oppenheimer) లో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాన్ని తొలగించాలని భారత్ లో నిరనన వ్యక్తమవుతోంది. క్రిస్టోఫర్ నోలన్ (Christoper Nolan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటివలే విడుదలై విజయవంతం అయింది. సినిమాలో ఓ శృంగార సన్నివేశంలో భగవద్గీతను చూపించడం కొంతమంది భారతీయుల ఆగ్రహానికి కారణమయింది.
భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతను ఓ శృంగార సన్నివేశంలో చూపడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్, కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్ సైతం స్పందిస్తూ.. వెంటనే చిత్ర బృందం ఈ సన్నివేశాన్ని తొలగించకపోతే చర్యలు తప్పవని అన్నారు. భగవద్గీత ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చిందని అటువంటి పవిత్ర గ్రంధాన్ని ఇలా చూపడం ఆ గ్రంధం గొప్పదనాన్ని కించపరిచినట్టేనని అన్నారు.
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అంశంపై సీరియన్ అయినట్టు తెలుస్తోంది. సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అణు బాంబు కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కింది.