Switch to English

బ్రేకింగ్: సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం

91,309FansLike
57,007FollowersFollow

తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం అధికార టీఆర్ఎస్ లో విలీనం కావడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ కు లేఖ అందజేశారు.

ఇప్పటివరకు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరగా.. గురువారం తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరూ కలిసి తొలుత ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా మినిస్టర్స్ క్వార్టర్స్ లోని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. తామంతా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరూత వినతిపత్రం అందజేశారు. దీనిపై వారంతా సంతకాలు చేశారు.

స్పీకర్ ను కలిసిన వారిలో సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), జాజుల సురేందర్ రెడ్డి (ఎల్లారెడ్డి), రేగ కాంతారావు (పినపాక), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), హరిప్రియా నాయక్ (ఇల్లందు), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), హర్షవర్థన్ రెడ్డి (కొల్లాపూర్), పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు) ఉన్నారు. తమ లేఖపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు స్పీకర్ ను కోరారు.

కాగా, ఈ పరిణామాలపై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడింది. ఈ చర్యలకు నిరసనగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసెంబ్లీ లోని గాంధీ విగ్రహం గేటు వద్ద దీక్షకు దిగారు. మూతికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన తెలుపుతూ అక్కడే కూర్చున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నిన్న చిరంజీవి, నేడు రామ్ చరణ్ కు.. జాతీయస్థాయి కీర్తి..! మెగాభిమానుల్లో...

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెర మీద కనపడితే మెగా ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. వారు స్టెప్పేసినా,...

మట్టి కుస్తీ మూవీ రివ్యూ – కొత్తగా ఏం లేదు

పలు తమిళ చిత్రాలతో తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. మాస్ మహారాజ్ రవితేజ సహనిర్మాతగా వ్యవహరించిన మట్టి కుస్తీ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు...

హిట్ 2 మూవీ రివ్యూ – డీసెంట్ థ్రిల్లర్

హిట్ ఫ్రాంచైజ్ లో సెకండ్ మూవీ హిట్ 2 ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ చిత్రం...

గుడ్డు పోయింది బిగ్ బాస్.! వాట్ ఏ కామెడీ.!

కొన్ని తాళ్ళు కట్టబడి వున్నాయ్.. వాటిల్లోంచి చేతిలోని ఓ బ్యాటు లాంటి వస్తువు సాయంతో, గుడ్డుని దాని మీద పెట్టుకుంటూ వెళ్ళాలి.. బుట్టలో గుడ్లను వెయ్యాలి....

ప్రభాస్ ఆస్తులపై ఏడుస్తున్న నేషనల్ మీడియా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్...

రాజకీయం

దివ్యాంగులకు ప్రత్యేక శాఖ..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు డిసెంబర్ 3న శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది....

రాష్ట్రం సైకో చేతిలో ఉంది.. అందరం కలిసి కాపాడుకోవాలి: చంద్రబాబు

‘ఒక సైకో చేతిలో రాష్ట్రం నాశనమైపోతోంది.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆ సైకో ఊరికో సైకోని తయారు చేస్తున్నాడు. వైసీపీ సైకోలను భూస్థాపితం చేసే వరకూ పోరాడుతా’ అని చంద్రబాబునాయుడు...

జనసేనకు ఎన్ని సీట్లు.? వైసీపీలో అంతర్మధనమెందుకు.?

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు గెలచుకుంది. ఓట్ల శాతం కూడా సింగిల్ డిజిట్ దాటలేదు.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు.! తాను ఓడిపోయిన విషయాన్ని...

‘పోలవరంపై 3 ప్రశ్నలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి’ మంత్రి అంబటి

పోలవరం విషయంలో చంద్రబాబునాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పోలవరం సందర్శనపై ఆయన చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఈమేరకు మీడియాతో మాట్లాడుతూ.....

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా..? ఆమెకు ఇచ్చిన గౌరవం నాకెందుకివ్వరు: షర్మిల

‘నన్ను ఆంధ్రావాళ్లు అంటున్నారు. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా..? ఆయన భార్యను గౌరవించినప్పుడు నన్నెందుకు గౌరవించరు..?’ అని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడే పెరిగాను.....

ఎక్కువ చదివినవి

అమ్మబాబోయ్.. మెహ్రీన్ ఏమిటి ఇలా తయారయ్యింది..?

టాలీవుడ్‌లో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఎఫ్2, ఎఫ్3 సినిమాల సక్సెస్‌తో అమ్మడికి క్రేజ్...

పోలవరం వద్ద ఉద్రిక్తత..! రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

పోలవరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలవరం డ్యామ్ సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదేం...

అమరావతిపై సుప్రీం ఏం చెప్పింది.? వీళ్ళకి ఏం అర్థమయ్యింది.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సర్కారుకి ఊరట.! కాదు కాదు, హైకోర్టుకే మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు.! పచ్చ బ్యాచ్ అమరావతి నుంచి మూటాముళ్ళు సర్దుకోవాల్సిందే.! ఏపీకి మూడు రాజధానులు తథ్యం.! సుప్రీం...

రాశి ఫలాలు: బుధవారం 30 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:22 తిథి: మార్గశిర శుద్ధ సప్తమి మ.1:32 వరకు తదుపరి అష్టమి సంస్కృతవారం:సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: ధనిష్ఠ మ.12:40 వరకు తదుపరి శతభిషం యోగం:...

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు....