Switch to English

సినిమా రివ్యూ : సెవెన్

91,242FansLike
57,314FollowersFollow

నటీనటులు : హవీష్, రెజినా కాసాండ్రా, పూజిత పొన్నాడ, నందిత శ్వేతా, త్రిదా చౌదరి, అదితి ఆర్య, అనిషా అంబ్రోస్ , రెహమాన్, తదితరులు.
కెమెరా , దర్శకత్వం : నిజార్ షఫీ
కథ , స్క్రీన్ ప్లే : నిర్మాత : రమేష్ వర్మ
సంగీతం : చైతన్ భరద్వాజ్
ఎడిటింగ్ : ప్రవీణ్ కె ఎల్

సాధారణంగా థ్రిల్లర్ జోనర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారన్నది అందరికి తెలుసు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా సరికొత్త తరహాలో థిల్లర్ సినిమాలు తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటాయి. సరైన కంటెంట్, క్రూ ఉంటె చాలు. తాజాగా తెలుగులో ఈ తరహా కథతో రెడీ అయ్యాడు హీరో హవీష్. కొంత గ్యాప్ తరువాత హవీష్ హీరోగా నటిస్తున్న చిత్రం సెవెన్. కెమెరామెన్ నిజార్ షఫీ దర్శకత్వంలో రమేష్ వర్మ అందించిన కథతో వచ్చిన ఈ సినిమాలో ఏకంగా అరుగులు హీరోయిన్స్ ఉండడం విశేషం. మరి ఆ ఆరుగురు హీరోయిన్ల కథేమిటి .. ఇంతకీ ఈ 7 అంటే ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

కార్తీక్ ( హవీష్ ) ఓ సాఫ్ట్ వెర్ కంపెనీలో పనిచేస్తూ, అమెరికా వెళ్లాలనే గోల్ తో ఉంటాడు. మరో వైపు రమ్య ( నందిత శ్వేతా ) తమ భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు ఇలా జెన్నీ ( అనిషా అంబ్రోస్), తరువాత అదితి ఆర్య ఇలా ముగ్గురు ఒకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారు తమ భర్త కనిపించడం లేదంటూ. ఆ తరువాత దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. తరువాత జరిగే నాటకీయ పరిణామాల మధ్య తమ భర్త కార్తీక్ ( హవీష్ ) ఒక్కరే అని తేలుతుంది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న కార్తీక్ ని పట్టుకుంటారు. కానీ ఇంతలో కార్తీక్ లాగే మరో వ్యక్తి ఉన్నాడని అతని పేరు కృష్ణమూర్తి అని తెలుసుకుంది? అసలు ఈ అమ్మాయిలను మోసం చేసింది కార్తికా , లేక కృష్ణమూర్తి అన్న అనుమానం కలుగుతుంది పోలీసులకు. ఈ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేస్తారు .. అసలు కార్తీక్ జీవితంలో జరిగింది ఏమిటి ? అసలు కృష్ణమూర్తి నిజంగా ఉన్నాడా ? అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

హీరో హవీష్ చక్కని నటన కనబరిచాడు. రెండు భిన్నమైన పాత్రల్లో కొత్తదనం చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇక గ్లామర్ హీరోయిన్ రెజీనా తన పాత్రలో చక్కగా నటించి సూపర్ అనిపించుకుంది. రెజినా ఈ పాత్ర ద్వారా కథను నిలబెట్టే ప్రయత్నం చేసిందని చెప్పాలి. మరో కీ రోల్ పోషించిన నందిత శ్వేతా నటన హైలెట్ గా నిలుస్తుంది. తనదైన నటన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక మిగతా హీరోయిన్లు పూజిత, త్రిదా చౌదరి, అనిషా అంబ్రోస్, అతిధి ఆర్య తమ తమ పాత్రల్లో బాగా చేసారు. ఇక రెహమాన్ తనదైన స్టైల్ లో కథను ముందుకు నడిపించాడు. కథ బాగున్నప్పటికీ కథనం అంత ఆకట్టుకోలేని విధంగా సాగుతుంది. ముఖ్యంగా కొన్ని ట్విస్టులు కథపై ఆసక్తి పెంచుతాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ .. రెజినా పాత్రకు సంబందించిన సన్నివేశాలు బాగున్నాయి.

టెక్నీకల్ హైలెట్స్ :

చైతన్య భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో మ్యూజిక్ నిరాశ పరిచింది. ఇక సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ అందించిన కెమెరా పనితనం సూపర్. కానీ దర్శకత్వ పరంగా నిజార్ సరైన న్యాయం చేయలేకపోయాడు. ఆసక్తికరమైన కథను ఎంచుకున్నప్పటికీ దర్శకుడు ఆ కథను ఎక్కడ పట్టు తప్పకుండా నడిపించడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. థ్రిల్లర్ సినిమాలకు కావలసిన అంశాలు చాలా ఉన్నప్పటికీ కథనంలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ముందే తెలిసిపోవడంతో సినిమా పై ఆసక్తి తగ్గింది.

ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువకు డోకా లేదు. ఈ కథ కొత్తదేం కాదు .. కానీ స్క్రీన్ ప్లే విషయంలో కాస్త కొత్తదనం ప్రయత్నం చేసినప్పటికీ అక్కడక్కడా బోర్ కొట్టే సన్నివేశాలు కథపై ఆసక్తి తగ్గించాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఎక్కదు.

విశ్లేషణ :

రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన 7, ముందునుండి ఈ సినిమా విషయంలో పెంచిన ఆసక్తి సినిమాలో లేకపోవడం నిరాశకు గురిచేస్తుంది. కథ బాగున్నప్పటికీ , కథనం బోర్ కొట్టడం. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల ప్రేమ కథ ఆసక్తిగా సాగకపోవడం నిరాశ కలిగించే అంశాలు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే వారికీ ఈ సినిమా పెద్దగా ఆసక్తి కలిగించదు. హవీష్ రెండు పాత్రలో చేసినప్పటికీ ఓ పాత్ర ఆసక్తికరంగా అనిపించదు. ఇక కథానుసారంగా వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడికి థ్రిల్ కలిగించవు. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించొచ్చు. మొదటి భాగం స్పీడ్ గా సాగితే .. రెండో బాగా చాలా నెమ్మదిగా కథ సాగడంతో బోర్ కొట్టేస్తుంది. హవీష్, రెజినా, నందిత శ్వేతా పాత్రలు హైలెట్ గా ఉంటాయి.

ట్యాగ్ లైన్ : సెవెన్ .. మిగతా ఆరు కష్టమే

4956 COMMENTS