Switch to English

ఎవరీ బీఆర్ శెట్టి.. ఏమా కథ?

సత్యం రామలింగరాజు స్టోరీ గుర్తుందా? సంస్థ లాభాలను ఎక్కువ చేసి చూపించి మదుపరులను మోసం చేసి జైలుపాలయ్యారు. చివరకు సత్యం సంస్థే మరో సంస్థలో కలిసిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి వ్యవహారమే మరొకటి తెరపైకి వచ్చింది.

భగవత్తు రఘురామ్ శెట్టి అలియాస్ బీఆర్ శెట్టి.. అబుదాబీలో స్థిరపడిన భారతీయ సంపన్నుడు. ఎంఎన్ సీ హెల్త్ కేర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లోని 12 నగరాల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేసిన ఆయన అనతి కాలంలోనే ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఈయన గురించి మనకెందుకంటారా? టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు అమరావతిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున వంద ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. అక్కడ హోటల్స్, ఆస్పత్రులు, ల్యాబ్ లతో మెడికల్ సిటీ కట్టేస్తానని అప్పటి ఏపీ సర్కారుతో ఒప్పందం చేసుకున్నారు. అలా చాలా విలువైన భూములను చాలా తక్కువ ధరకు చేజిక్కించుకున్నారు. పోనీ అందులో ఏమైనా కట్టారా అంటే ఇప్పటివరకు ఏమీ లేదు.

ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ నేతృత్వంలోని ఏపీ ఎకనామిక్ బోర్డే ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించింది. ఈ నేపథ్యంలో ఈ శెట్టిగారి ఎంఎన్ సీ హెల్త్ కేర్ సంస్థ గురించి విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సంస్థ ఆస్తులను ఎక్కువ చేసి చూపించారని, శెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని తేలింది. చివరకు తన వాటా షేర్లను కూడా బ్యాంకులకు తనఖా పెట్టిన సంగతి బయటపడింది. దీంతో ఎంఎన్ సీ షేర్ ధర ఏకంగా 70 శాతం పడిపోయింది.

అచ్చం సత్యం సంస్థ వ్యవహారంలాగనే ఇక్కడ కూడా కథ నడిచింది. ఇన్వెస్టర్లు ఆందోళన చేయడంతో కంపెనీ కీలక బాధ్యతల నుంచి శెట్టి తప్పుకున్నారు. అలాంటి వ్యక్తికి అమరావతిలో అప్పనంగా ఇచ్చిన వంద ఎకరాల భూమిని జగన్ సర్కారే ఏం చేస్తుందో చూడాలి.

సినిమా

ఓటీటీ రిలీజ్‌ కు అభ్యంతరం లేదన్న తెలుగు స్టార్‌ హీరో

థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్‌ అయ్యేది నమ్మకం తక్కువే. ఆ తర్వాత అయినా ఓపెన్‌...

బాలీవుడ్‌ మరో స్టార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ లో వరుసగా జరుగుతున్న సంఘటలు సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారిన పడటంతో పాటు సుశాంత్‌ తో...

ఎక్స్ క్లూజివ్: ఊహించని డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ థ్రిల్లర్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. క్లాస్ నుంచి కంప్లీట్ మాస్ లుక్ లోకి మారి...

షార్ట్ ఫిలింని కాస్తా మినీ మూవీగా మార్చేసిన రెజీనా.!

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ రెజీనా. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ...

సినిమా అవకాశమంటూ ఘరానా మోసం.. డబ్బులు వసూలు చేసి ఆపై..

సినిమా అంటే ఇష్టం అందరికీ ఉంటుంది. సినిమాల్లో నటించాలనే వ్యామోహం ఉంటుంది మరికొందరికి. ఇటువంటి వారిని సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలు గతంలో...

రాజకీయం

రాజస్థాన్ రగడ: పైలట్ దారెటు?

రాజస్థాన్ లో రాజకీయ రగడ మరింత ముదిరింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇరువురూ తమ తమ బల ప్రదర్శనలు ఏర్పాటు...

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాళ్‌ హెమటాబాద్‌ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రాయ్‌ తన స్వగ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆయన్ను చంపేసి ఆ తర్వాత ఉరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా...

9 ఏళ్ల తర్వాత సుప్రీంలో పద్మనాభస్వామి ఆలయ కేసు తీర్పు

దేశంలోని అత్యంత సంపద ఉన్న దేవాలయంగా కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి వారి ఆలయం నిలిచిన విషయం తెల్సిందే. ట్రావెన్‌కోర్‌ రాజ వంశానికి చెందిన రాజులు ఈ భారీ సంపదను దాచారు. పద్మనాభస్వామి వారి...

పార్టీ పేరు రగడ: వైఎస్సార్సీపీకి నోటీసులు.!

ఇకపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనీ, వైఎస్సార్సీపీ అనీ పిలవడానికి వీల్లేదా.? ఏమో, ముందు ముందు ఆ పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా అయితే ఇప్పటిదాకా...

నిండా ముంచేసిన ముద్రగడ.. తెరవెనుక వున్నదెవరు.?

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదు. నిజానికి, కాపు సామాజిక వర్గం కొత్తగా రిజర్వేషన్లు కోరడంలేదు. చాలా ఏళ్ళ క్రితం తమకున్న బీసీ-రిజర్వేషన్‌ని తిరిగి పునరుద్ధరించాలని మాత్రమే కోరుతోంది....

ఎక్కువ చదివినవి

కేరళ బంగారం స్మగ్లింగ్‌ ముఖ్య సూత్రదారి స్వప్న సురేష్ అరెస్ట్

కేరళ తిరువనంతపురం ఎయిర్‌ పోర్ట్‌లో జులై 4వ తారీకున 15 కోట్ల విలువైన 30 కేజీల బంగారంను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్న విషయం తెల్సిందే. ఆ బంగారంకు సంబంధించిన విచారణ ప్రస్తుతం కేరళ...

సినిమా అవకాశమంటూ ఘరానా మోసం.. డబ్బులు వసూలు చేసి ఆపై..

సినిమా అంటే ఇష్టం అందరికీ ఉంటుంది. సినిమాల్లో నటించాలనే వ్యామోహం ఉంటుంది మరికొందరికి. ఇటువంటి వారిని సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలు గతంలో జరిగాయి. ఇటువంటి మోసం మళ్లీ ఒకటి...

బిగ్‌ ట్విస్ట్‌: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో అరెస్టులు.!

విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి లీక్‌ అయిన విషవాయువుల కారణంగా 12 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ ఘటనపై చెలరేగిన రాజకీయ దుమారం అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి...

వేగంగా పోలవరం.. గడ్డర్ల ఏర్పాటు షురూ

ఏపీ ప్రజల వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. గడువులోగా పనులన్నీ పూర్తిచేసి సాగునీరందించే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం స్పిల్ వేపై గడ్డర్లు ఏర్పాటు చేసే ప్రక్రియ...

పుష్ప అప్‌డేట్‌: విజయ్‌ సేతుపతి ప్లేస్‌లో రంగస్థలం నటుడు?

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న పుష్ప చిత్రం షూటింగ్‌ ప్రారంభంకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. గత ఏడాదిలోనే సినిమాను...