Switch to English

బీజేపీకి ఉచిత సలహాలపై విజయసాయిరెడ్డికే పేటెంట్‌ వుందా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

అడక్కుండా ఇచ్చేదాన్నే ఉచిత సలహా అంటారని ఓ సినిమాలో ఓ సెటైరికల్‌ డైలాగ్‌ వుంటుంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ‘పసుపు మిడతల దండు’ అంటూ, భారతీయ జనతా పార్టీని అప్రమత్తం చేసే క్రమంలో ఓ ఉచిత సలహా పారేశారు. అఫ్‌కోర్స్‌, ఆ ఉచిత సలహా బెడిసి కొట్టి, ‘నీ బోడి సలహా ఎవడిక్కావాలి.?’ అంటూ బీజేపీ, దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా కౌంటర్‌ ఎటాక్‌కి దిగిందనుకోండి.. అది వేరే విషయం.

ఈయనేదో అంటారు.. అట్నుంచి వచ్చే కామెంట్‌ని అస్సలేమాత్రం పట్టించుకోరు. బీజేపీ నేతలు ఓ రేంజ్‌లో కడిగి పారేస్తే, తిరిగి బీజేపీ నేతల్ని ఒక్క మాట కూడా అనే ధైర్యం విజయసాయిరెడ్డికి లేదాయె. ఇంకోపక్క విజయసాయిరెడ్డి.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని ఉద్దేశించి ‘ఉచిత సలహా’ విషయమై సెటైర్‌ వేసేశారు ట్విట్టర్‌లో. ‘బీజేపీకి మంచి పాలనానుభవం వుంది.. నీ ఉచిత సలహాలు బీజేపీకి అవసరం లేదు..’ అంటూ తన తాజా ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

అసలేంటి విజయసాయిరెడ్డి ‘ఆరాటం’.! బీజేపీ బాగు చేయడానికీ, బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికీ.. ఆయనెందుకు అంత తాపత్రయపడుతున్నట్లు.? టీడీపీ నుంచి వలస వెళుతున్న నేతల్ని ‘మిడతలు’గా అభివర్ణించారు విజయసాయిరెడ్డి. అయితే, అలా వలస వెళుతున్న నేతలు బీజేపీలోకి వెళితేనే వాళ్ళు మిడతల కింద లెక్క. అదే టీడీపీ నేతలు, వైసీపీలోకి వస్తే మాత్రం.. ఈ లెక్క ఇంకోలా వుంటుంది. మొన్నామధ్య రఘురామకృష్ణరాజు వ్యవహారంలో, ‘పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం అనైతికం..’ అంటూ లెక్చర్‌ దంచేశారు విజయసాయిరెడ్డి.

అదే, టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతల ‘నైతికత’ ఏంటి.? అనడిగితే, ‘అబ్బే, నాకేంటి సంబంధం.?’ అనేశారు విజయసాయిరెడ్డి. మొత్తమ్మీద, బీజేపీ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంగతెలా వున్నా, విజయసాయిరెడ్డికి మాత్రం ‘స్పెషల్‌ ఇంట్రెస్ట్‌’ వున్నట్లే కన్పిస్తోంది. లేకపోతే, బీజేపీ ‘పాలనానుభవం’ గురించి సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం విజయసాయిరెడ్డికి ఏమొచ్చింది.? ఎక్కడో ఏదో తేడా కొట్టేస్తోంది కదూ.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...