ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరాలి. లేదంటే, అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. భారత పార్లమెంటరీ వ్యవస్థకే అవమానం. ఎందుకంటే, ఆ పార్లమెంటు సాక్షిగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది హక్కుగా సంక్రమించింది. దాన్ని నిస్సిగ్గుగా బీజేపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. నీతి అయోగ్ అనీ, 14వ ఆర్థిక సంఘమనీ కుంటి సాకులు చూపిస్తూ, ప్రత్యేక హోదాని తొక్కి పెట్టిన బీజేపీ, కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడంతో వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది.
పుదుచ్చేరి రాష్ట్రం కాదు, కేంద్ర పాలిత ప్రాంతం.. ఆ పుదుచ్చేరిలా ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేసెయ్యమంటారా.? అంటూ ఓ తెలివి తక్కువ బీజేపీ నేత అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు. దురదృష్టమేంటంటే, ఇలాంటోళ్ళంతా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పుట్టి, ఆంద్రపదేశ్ రాష్ట్రం పరువు తీస్తుంటారు.
ఎలాంటోడైనాసరే, మాతృభూమికి చేతనైనంత మేలు చేయాలనుకుంటాడు. ఉత్తరాదికి చెందిన వ్యక్తులు రైల్వే శాఖ మంత్రులుగా వున్నప్పుడు వారి వారి రాష్ట్రాలకు అదనపు మేలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక.. గుజరాత్ రాష్ట్రానికి దక్కిన అదనపు సౌలభ్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్నవే. కానీ, ఆంధ్రపదేశ్ తరఫున గట్టిగా మాట్లాడటానికి ఒక్కడంటే ఒక్క ప్రజా ప్రతినిథి సరైనోడు కనిపించడు.
ఎవరు అధికారంలో వున్నాసరే, కేంద్రానికి బాకా ఊదాల్సిందే. ఇదేం బానిసత్వమో. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతమంటూ ఏపీ మీద వెటకారం చేయడమంటే.. ఏమో, ముందు ముందు రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేయాలన్న దురాలోచన బీజేపీ అధిష్టానం మదిలో మెదులుతోందేమో అన్న అనుమానాలు కలగకమానవు.
‘ఇంతకంటే పతనం ఇంకేముంటుంది.?’ అని విభజన సమయంలో అంతా అనుకున్నాం. అంతకు మించిన పతనాన్ని ఇప్పుడు చూస్తున్నాం. భవిష్యత్తులోనూ పతన సంకేతాలు తప్ప, బాగుపడే పరిస్థితులే కన్పించడంలేదు ప్రస్తుతానికి. రాష్ట్రానికి ఇంకెవరో శతృవులు కాదు.. రాష్ట్రం నుంచి రాజకీయాలు వెలగబెడ్తున్నవారే రాష్ట్రానికి శతృవులైపోతున్నారు.
565009 806045This internet website could be a walk-through its the data you wanted in regards to this and didnt know who ought to. Glimpse here, and youll completely discover it. 546500
307194 654224As I internet site owner I believe the articles here is genuinely amazing , thankyou for your efforts. 478344
900598 939720Its excellent as your other content : D, appreciate it for posting . 16262
355904 823516I took a break to view your post. I identified it extremely relaxing 541349