Switch to English

కార్తీ ‘సుల్తాన్’ మూవీ రివ్యూ – మాస్ మసాలా ఎంటర్టైనర్.!

Critic Rating
( 2.75 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow
Movie సుల్తాన్
Star Cast కార్తీ, రష్మిక మందన్నా
Director భాగ్యరాజ్ కన్నన్
Producer ప్రకాష్ బాబు, ప్రభు
Music యువన్ శంకర్ రాజా , వివేక్ మెర్విన్
Run Time 2 గం 29 నిమిషాలు
Release 02 ఏప్రిల్ 2021

తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ క్రేజ్ అండ్ స్టార్డం ఉన్న హీరో కార్తీ. ఖైదీ సినిమాతో తెలుగులో తన మార్కెట్ సత్తా ఎంతో చూపించిన కార్తీ చేసిన మరో యాక్షన్ ఫామిలీ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. గోల్డెన్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ‘రెమో’ ఫేమ్ భాఖ్యరాజ్ డైరెక్టర్. ట్రైలర్ తో ఆసక్తిని పెంచేసిన ‘సుల్తాన్’ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

రోబోటిక్ ఇంజనీరింగ్ లో తన స్టడీస్ పూర్తి చేసుకున్న సుల్తాన్(కార్తీ) తన ఊరెళ్ళి, తన ఫాదర్(నెపోలియన్) కి చెప్పి జపాన్ వెళ్లి సొంత కంపెనీ పెట్టాలనుకుంటాడు. కార్తీ ఫాదర్ అవసరాన్ని బట్టి కొన్ని డీలింగ్స్ చేస్తుంటాడు. అందుకోసం తన దగ్గర 94 మందితో ఓకే సైన్యం ఉంటుంది. సుల్తాన్ అంటే వాళ్లందరికీ చాలా ఇష్టం మరియు గౌరవం. సుల్తాన్ సరదాగా కొద్ది రోజులు ఇంట్లో ఉండి వెళదాం అని వచ్చిన టైంలో తండ్రి చనిపోవడంతో తన ముందు రెండు టార్గెట్స్ ఉంటాయి. అందులో మొదటిది ఆ 94 మందికి ఏమీ జరగనివ్వనని సుల్తాన్ తండ్రికి మాట ఇవ్వడం, మరొకటి అమరావతి ప్రజలని పట్టి పీడిస్తున్న సేతుపతి(రామచంద్ర రాజు) నుంచి వ్యవసాయ భూముల్ని తిరిగి ప్రజలకి ఇప్పిస్తానని సుల్తాన్ తండ్రి మాటివ్వడం. ఈ రెండు పనులను నిర్వర్తించడం కోసం సుల్తాన్ చేసిన పనులేమిటి? ఎలాంటి అవరోధాల్ని ఎదుర్కున్నాడు? చివరికి తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టాడా లేదా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

కార్తీ మరోసారి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో సుల్తాన్ పాత్రలో సూపర్బ్ నటనని కనబరిచాడు. కార్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు, కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ సీన్స్ మరియు అదిరిపోయే యాక్షన్ ఇలా అన్ని ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించాడు. స్పెషల్ గా ఇంటర్వల్ మరియు సెకండాఫ్ లో కనిపించే యాక్షన్ అవతార్ మాస్ ఆడియన్స్ చేత ఈలలు వేయిస్తుంది. రష్మిక మందన్న పల్లెటూరి అమ్మాయిగా, మాస్ లుక్స్, యాటిట్యూడ్ ఉన్న పాత్రలో యువతని ఆకట్టుకుంటుంది. కార్తీ – రష్మిక లవ్ ట్రాక్ కి యువత కచ్చితంగా బాగా కనెక్ట్ అవుతారు. ముఖ్య పాత్రలు చేసిన నెపోలియన్, లాల్ లు తమ నటనతో సినిమాకి బలాన్ని చేకూర్చారు. రామచంద్ర రాజు మరోసారి నెగటివ్ షేడ్స్ లో హీరోకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు.

తెర వెనుక టాలెంట్..

ఒకవేళ భారతంలో కౌరవుల వైపు న్యాయం ఉండి, కృష్ణుడు కౌరవుల పక్షాన నిలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో తీసుకున్న ఈ మూవీ స్టోరీ పాయింట్ సూపర్బ్ గా అనిపిస్తుంది. కానీ ఏపూర్తి కథగా తీసుకున్నప్పుడు మన రెగ్యులర్ మాస్ మసాలా ఫిలిమ్స్ లానే అనిపిస్తుంది. రెగ్యులర్ సినిమా అయినా కమర్షియల్ అంశాలు, మాస్ ఆడియన్స్ ఈలలు కొట్టే సీన్స్ పడితే సినిమా నచ్చేస్తుంది. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథనం ఊహాజనితంగా అనిపిస్తున్నా, కాస్త డల్ అవుతున్న ప్రతిసారి ఏదో ఒక మోమెంట్ తో హై ఫీలింగ్ ఇస్తుంటారు. దాంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు. డైరెక్టర్ గా ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులకి చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ కథ ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే నెక్స్ట్ లెవల్ సినిమా తీయగలడు.

సత్యన్ సూర్యన్ విజువల్స్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. ఫ్రేమ్ లో అంతమంది ఆర్టిస్టులని ఒకేసారి చూపించడంలో, సినిమా మూడ్ ని విజువల్స్ లో చూపించడంలో ది బెస్ట్ అనిపించుకున్నాడు. వివేక్ – మర్విన్ పాటలు తెలుగు డబ్ అవ్వడం వలన పెద్దగా చెప్పుకునే స్థాయిలో అయితే లేవు. కానీ యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. రూబెన్ ఎడిటింగ్ ఓకే ఓకే అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ఫెంటాస్టిక్ అని చెప్పచ్చు.

విజిల్ మోమెంట్స్:

– ఫస్ట్ హాఫ్
– యాక్షన్ ఎపిసోడ్స్
– ఇంటర్వెల్ బ్లాక్
– కార్తీ అండ్ గ్యాంగ్ మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్
– విజువల్స్ అండ్ నేపధ్య సంగీతం

బోరింగ్ మోమెంట్స్:

– స్ట్రాంగ్ కథ లేకపోవడం
– రెగ్యులర్ అనిపించే సెకండాఫ్
– బలంగా లేని విలనిజం
– బెటర్ గా ఉండాల్సిన లవ్ స్టోరీ

విశ్లేషణ:

కార్తీ అండ్ టీం మొదటి నుంచీ చెప్పినట్టు ‘సుల్తాన్’ ఒక మాస్ మసాలా మూవీ. వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేసి తీశారో వాళ్ళకి మాస్ సినిమా బాగా నచ్చుతుంది. రొటీన్ కథ, ఊహాజనిత కథనం ఉన్నా ఆడియన్స్ కి కావాల్సిన హై మోమెంట్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకోవడంతో హ్యాపీగా సినిమా ఒకసారి చూడచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. కార్తీ అభిమానులతో పాటు మాస్ కి నచ్చే సినిమా ‘సుల్తాన్’ .

చూడాలా? వద్దా?: మాస్ మసాలా మూవీ చూడాలనుకునే వారు హ్యాపీగా చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.75/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...