Switch to English

ఆంధ్రపదేశ్ రాష్ట్రాధినేతగా పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ అంతరంగమిదే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

రాష్ట్రాధినేత అంటే ఎవరు.? ఇంకెవరు ముఖ్యమంత్రే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ‘రాష్ట్రాధినేత అవుతారు’ అనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీ వున్నారట. ‘ఆంధ్రపదేశ్ రాష్ట్రాధినేతగా పవన్ కళ్యాణ్‌ని మనం చేద్దాం..’ అని ప్రధాని నరేంద్ర మోడీ తనతో పలు మార్లు చెప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల వేళ సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి.? అన్నదానిపై జనసైనికుల్లోనూ కొన్ని అనుమానాలున్నాయి. ఓ పక్క, బీజేపీ – జనసేన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి చెందిన తెలంగాణ నేతలు పవన్ కళ్యాణ్ మీద ‘తేలికపాటి’ వ్యాఖ్యలు చేసేస్తున్నారు. ఆయన్ని తేలిక చేసేస్తున్నారు.

అసలు బీజేపీ – జనసేన మధ్య పొత్తు లేదంటున్నారు. ఇంకోపక్క, బీజేపీ అధినాయకత్వం తరఫున, జనసేనానితో అత్యంత వ్యూహాత్మకంగా చర్చలూ జరుగుతున్నాయి. వీటిల్లో ఏది నిజం.? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి బీజేపీ ఒప్పుకుంటుందా.? బీజేపీ అధినాయకత్వం ఒప్పుకున్నా, ఏపీ బీజేపీలోని ప్రో టీడీపీ, ప్రో వైసీపీ వర్గాలు సుముఖత వ్యక్తం చేస్తాయా.? అన్నవి ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ ప్రశ్నే. తిరుపతి ఉప ఎన్నికలో రాజకీయ లబ్ది కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మునగచెట్టెక్కించేస్తున్నారు బీజేపీ నేతలు. స్వతహాగా పవన్ కళ్యాణ్ అంటే అభిమానమెక్కువ గనుక సోము వీర్రాజు, ‘రాష్ట్రాధినేత..’ అంటూ పవన్ మీద, బీజేపీ అధిష్టానం మాటగా చెప్పేశారనుకోవాలి.

రాష్ట్రం పట్ల, రాష్ట్ర రాజకీయాల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి వుంటే, రాష్ట్ర బీజేపీ తీసుకున్న ఒకే రాజధాని, స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ సబబు కాదన్న నిర్ణయాలకు కేంద్ర నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించి వుండేది. అన్నిటికీ మించి, వైసీపీ పాలనలో రాష్ట్రం పలు సందర్భాల్లో రావణకాష్టంగా మారినప్పుడూ కేంద్రం జోక్యం చేసుకోకపోవడం వైసీపీతో తమకున్న తెరవెనుక బంధం వల్లేనన్న విమర్శకు బీజేపీ సమాధానం చెప్పాల్సి వుంటుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

బీజేపీ ఆలస్యం.. టిడిపి,జనసేనకి అమృతమా? విషమా?

మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ జట్టుగా వెళ్తున్నాయి. ఎన్నికలని పురస్కరించుకొని వైసీపీ నాలుగు రోజుల క్రితమే 175 అసెంబ్లీ స్థానాలకి 24 పార్లమెంటు...

అందరినీ మెప్పించే చిత్రం ‘టిల్లు స్క్వేర్’: దర్శకుడు మల్లిక్ రామ్

తెలుగునాట యువతలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాలలో 'డీజే టిల్లు' ఒకటి. టిల్లుగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల...

RC16 : లాంఛనంగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం

RC16 : రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటింది. గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవ్వడంతో బుచ్చిబాబు సినిమాను చరణ్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...