Switch to English

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను కొంత ఆలస్యంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మొన్నటి ఫోకస్ టాస్క్ రిజల్ట్ ను నిన్నటి ఎపిసోడ్ లో ఇచ్చారు. దాని ప్రకారంగా మానస్ హెల్ప్ తీసుకున్న సన్నీ ఆఖరి స్థానంలో నిలిచాడు. ఆరవ స్థానంలో కాజల్, ఐదులో ప్రియాంక, నాలుగులో శ్రీరామ్, మూడులో సిరి, రెండవ స్థానంలో షణ్ముఖ్, మొదటి స్థానంలో మానస్ నిలిచారు.

ఇక మూడో టాస్క్ గా స్కిల్ ను ఎంచుకున్నారు ప్లేయర్స్. అయితే దానికంటే ముందు కాజల్, షణ్ముఖ్ ల మధ్య గట్టి వాదనే జరిగింది. ఎవరు సేఫ్ గేమ్ ఆడారు, ఎవరు జెన్యూన్ గా ఆడారు అన్న విషయంలో వాదన ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత షణ్ముఖ్, సిరి కూర్చుని సన్నీ, మానస్, కాజల్ గ్యాంగ్ మీద.. వీళ్ళేమో వాళ్ళ మీద నెగటివ్స్ మాట్లాడుకుంటూ గడిపేశారు. ప్రస్తుతం ప్రియాంక ఏ గ్రూప్ లోకి చెందకుండా అలా ఉండిపోయింది. ఇక శ్రీరామ్ అయితే హౌజ్ లో లోన్లీ అయిపోయాడు. దానికి తోడు దెబ్బ ఉండడంతో మంచానికే పరిమితం అయ్యాడు. ఇక సిరి కూడా కట్టుతో ఉండడంతో స్కిల్ గేమ్ లో వాళ్ళ తరుపున వేరే వాళ్ళను ఆడించుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. శ్రీరామ్ బదులుగా సన్నీ, సిరి బదులుగా షణ్ముఖ్ గేమ్ ఆడటానికి డిసైడ్ అయ్యారు.

ఇక స్కిల్ లో భాగంగా వాటర్ ను పోసి గుంతలాంటి దాన్లో ఉన్న బాల్స్ ను పైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో అందరూ తమ శక్తికి మించి కష్టపడ్డారు. అయితే షణ్ముఖ్ చివరి స్థానంలో నిలవగా సన్నీ ఆరవ స్థానంలో మానస్ మొదటి స్థానంలో నిలిచారు. మూడు రౌండ్స్ పూర్తయ్యాక కాజల్, ప్రియాంక తక్కువ పాయింట్స్ తో ఎలిమినేట్ అయ్యారు. ఇక సన్నీ, షణ్ముఖ్ కు టై అవ్వడంతో వారిద్దరికీ టైబ్రేకర్ నిర్వహించారు. మళ్ళీ అదే టాస్క్ పెట్టగా ఒక్క సెకండ్ తేడాలో సన్నీ విజయం సాధించాడు.

మొత్తానికి మూడు రౌండ్స్ పూర్తయ్యాక మానస్ హయ్యస్ట్ 18 పాయింట్స్ తో ఉండగా శ్రీరామ్ 16 పాయింట్స్ తో రెండవ స్థానంలో, సిరి 15 పాయింట్స్ తో మూడో స్థానంలో, సన్నీ 10 పాయింట్స్ తో నాలుగో స్థానంలో ఉన్నారు. మరి వీరిలో ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అన్నది రేపు తెలుస్తుంది. ప్రస్తుతానికి టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి మానస్ కు ఎడ్జ్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఎక్కువ చదివినవి

నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలనేది చంద్రబాబు తపన: కొడాలి నాని

గుడివాడలో క్యాసినో వ్యవహారంపై తనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. నన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని తీవ్ర ప్రయత్నాలు...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

జస్ట్ ఆస్కింగ్: గుడివాడ నిషేధిత ప్రాంతమా.?

గుడివాడలో ఏదో జరుగుతోంది. అధికార వైసీపీ ఎందుకో కంగారు పడుతోంది. లేకపోతే, గుడివాడలోకి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల్ని ప్రవేశించనివ్వట్లేదు. తాజాగా బీజేపీ నేతలనూ పోలీసులు అడ్డకుంటున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు...

ఆసక్తికర టైటిల్ తో మన ముందుకు రానున్న నాగ శౌర్య

రీసెంట్ గా నాగ శౌర్య నటించిన స్పోర్ట్స్ డ్రామా లక్ష్య ఫెయిల్ అయింది. ఆర్చరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే నాగ శౌర్య దాన్నుండి బయటపడి మరో కొత్త...

మరో కొత్త వైరస్ ‘నియో కోవ్’ వైరస్..! ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం..!!

కరోనా నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకముందే.. ఒమిక్రాన్ రూపంలో మరో ఉపద్రవం ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తూంటే వూహాన్ శాస్త్రవేత్తలు ‘నియో కోవ్’ (NeoCoV) పేరుతో కొత్త వైరస్ ను...