తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నిచ్చెలి శశికళ విడుదల తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు శశికళ విడుదలపై ఉహాగానాలు వచ్చాయి. శిక్షాకాలం కంటే ముందుగానే ఆమెను విడుదల చేస్తారని కథనాలు వెలువడ్డాయి. అయితే, ఇప్పటివరకు అలాంటిది ఏమీ జరగలేదు. 2017 ఫిబ్రవరి 15న ఆమె కోర్టులో లొంగిపోగా.. ఈ కేసులో 4 ఏళ్ల శిక్ష పడింది. ఈ నేపథ్యంలో శిక్షాకాలం కంటే దాదాపు మూడు వారాల ముందు శశికళను విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
జైలు నిబంధనల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు నెలకు మూడు రోజుల రెమిషన్ వర్తిస్తుంది. ఆ లెక్కన శశికళకు 138 రోజుల రెమిషన్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో మూడు వారాల ముందు ఆమె విడుదలకు ఎలాంటి సమస్యా ఉండదు. ఇక ఆమెను పగటిపూట కాకుండా రాత్రివేళ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పగటి పూట విడుదల చేస్తే రాజకీయ నాయకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని.. అందువల్ల అలాంటిది లేకుండా చూసేందుకు రాత్రి 9 గంటల తర్వాత విడుదల చేయడం మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
946659 20689I conceive this internet internet site has got some quite exceptional information for everyone : D. 741113
959089 48463Some genuinely superb weblog posts on this website , regards for contribution. 465062