Switch to English

Bholashankar Review: భోళా శంకర్ మూవీ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 2.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,844FansLike
57,764FollowersFollow
Movie భోళా శంకర్
Star Cast చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్
Director మెహర్ రమేష్
Producer అనిల్ సుంకర
Music మహతి స్వర సాగర్
Run Time 2 గం 42 నిమిషాలు
Release 11 ఆగష్ట్ 2023

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

రాష్ట్రంలో అమ్మాయిలు మిస్ అవుతున్న సమయంలో శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహా (కీర్తి సురేష్)తో కలిసి కోల్కతా కు వస్తాడు. తన జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఒక కిడ్నప్ కేసులో సాక్షిగా మారతాడు శంకర్.

అయితే భోళా శంకర్ కు కోల్కతా రావడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఇంతకీ శంకర్ కు ఉన్న ఆ కారణం ఏంటి? తన చెల్లెలు ఈ విషయంలో ఎలా ఇన్వాల్వ్ అయింది? భోళా శంకర్ చివరికి ఏం చేసాడు అన్నది ఈ చిత్ర కథ.

నటీనటులు:

మెగాస్టార్ చిరంజీవికి మరోసారి అన్ని ఎమోషన్స్ పండించగల పాత్ర దొరికింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడని చెప్పవచ్చు. కామెడీ సీన్స్ లో చిరంజీవి టైమింగ్ కు ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఇక ఎమోషనల్ సీన్స్ లో చిరు పెర్ఫార్మన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. అదరగొట్టేసాడు. మొత్తానికి భోళా శంకర్ లో చిరంజీవి ఆడియన్స్ ప్రేమించే విధంగా కనపడతాడు.

ఇక పెర్ఫార్మన్స్ పరంగా తర్వాత నిలిచేది కీర్తి సురేష్ పాత్ర. తాను ఎంత మంచి నటి అన్నది ఈ చిత్రం ద్వారా మరోసారి నిరూపించింది. ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో అందరినీ కంటతడి పెట్టించే పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తమన్నాకు చెప్పుకోదగ్గ పాత్ర దక్కలేదు కానీ ఉన్నంతలో బాగానే చేసింది. సుశాంత్ ది కూడా చిన్న పాత్రే. మిగతా సపోర్టింగ్ నటీనటులు పర్వాలేదు.

సాంకేతిక నిపుణులు:

తమిళ చిత్రం వేదాళంలోని పాజిటివ్ అంశాలను చక్కగా ప్రోజెక్ట్ చేసాడు దర్శకుడు మెహర్ రమేష్. అయితే అంతకు మించి చిరంజీవిని ది బెస్ట్ గా చూపించాడు. మెగా ఫ్యాన్స్ చిరు స్వాగ్ చూసి స్టన్ అవ్వడం ఖాయం. ఇక కీర్తి, చిరుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ను కూడా చక్కగా చూపించగలిగాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా, సెకండ్ హాఫ్ లో కథనం ఉరకలు పెడుతుంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేయడం, ఖుషి ఐకానిక్ సీన్ ను రీక్రియేట్ చేయడం కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.

మహతి స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అంతే. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్:

  • చిరంజీవి పెర్ఫార్మన్స్ ఇంకా స్వాగ్
  • కీర్తి సురేష్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

  • అవుట్ డేటెడ్ స్టోరీ, ట్రీట్మెంట్
  • ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్

విశ్లేషణ:

మొత్తానికి భోళా శంకర్ లో కొన్ని లోపాలు ఉన్నా కానీ చిరంజీవిని ప్రెజంట్ చేసిన విధానంలోనే పాస్ మార్కులు వేయించేసుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కు ఈ చిత్రంలో చాలానే మూమెంట్స్ ఉన్నాయి.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

1 COMMENT

సినిమా

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్న జగన్, అసెంబ్లీలోకి వెళ్ళడానికెందుకు భయపడుతున్నట్లు.?

ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకో వైపు, ప్రతిపక్ష హోదా ఆశిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అసెంబ్లీ వైపు అస్సలు చూడకుండా, అసెంబ్లీ చుట్టూనే...

ప్రజల ఆస్తి వైఎస్సార్.! కానీ, వైఎస్సార్ ఆస్తులు ప్రజలవి కావు.! అంతేనా.?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. వైఎస్సార్ అంటే, ప్రజల ఆస్తి.. అని సెలవిచ్చారామె. తాడిగడప మునిసిపాలిటీ పేరు నుంచి వైఎస్సార్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని పాటల్లో వేస్తున్న స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయని,...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ...