‘ఎన్.టి.ఆర్’ బయోపిక్ – నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణంలో భారీ అసంతృప్తిని మిగిల్చిన సినిమా అని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్టు – ఫ్లాపు కామన్ కావున ఆ బాధ నుంచి కోలుకున్న నందమూరి బాలకృష్ణ తన తడియూపారి సినిమా ‘రూలర్’ని చకచకా ఫినిష్ చేసాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, ఇటీవలే రిలీజైన టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత బాలయ్య ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో చేయనున్న సినిమా డిసెంబర్ 6న అధికారికంగా లాంచ్ కానున్న సంగతి మేము ఇది వరకే తెలిపాము. ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సినిమా కాస్టింగ్ మరియు టీంని ఫైనలైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా బాలయ్యతో తన హ్యాట్రిక్ కాంబినేషన్ కోసం మొదట సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మని పరిశీలించారు. ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉండడం, అలాగే బోయపాటి ఎప్పుడు చేసే దేవీశ్రీ ప్రసాద్ కూడా బిజీగా ఉండడంతో బోయపాటి శ్రీను – బాలయ్య కలిసి ఎస్ఎస్ థమన్ ని ఫైనలైజ్ చేసుకున్నారు.
ప్రస్తుతం థమన్ సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు అంతే కాక, ఎలాంటి కథకి అయినా బ్లాక్ బస్టర్ ట్యూన్స్ ఇస్తున్నాడు. దాంతో బాలయ్య మొదట థమన్ గురువుగా భావించే మణిశర్మని అనుకున్నా, కుదరకపోవడంతో శిష్యుడైన థమన్ కె ఫిక్స్ అయ్యారు. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని ‘జయ జానకి నాయక’ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
49942 594847Aw, this was a really good post. In concept I would like to put in writing like this in addition – taking time and actual effort to make a quite great article but what can I say I procrastinate alot and by no indicates appear to get something done. 361286
52210 965113A thoughtful opinion and suggestions Ill use on my internet page. Youve naturally spent some time on this. Effectively carried out! 525321
226699 479353Enjoyed reading by means of this, extremely good stuff, thankyou . 877859
570923 112940Superb post but I was wanting to know in case you could write a litte far more on this subject? Id be very thankful in case you could elaborate slightly bit more. Thanks! 824038