ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అవతార్2. ది వే ఆఫ్ వాటర్ పేరుతో విడుదలవుతున్న సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకుడు. ఇటివల రిలీజైన రెండో టీజర్ హీట్ పెంచుతోంది. అధిక సంఖ్యలో ధియేటర్లు.. ఏకంగా 7 భారతీయ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. అయితే.. ప్రేక్షకులకు ఈ సినిమా టికెట్ ధరలు షాక్ ఇస్తున్నాయి.
ఐమ్యాక్స్ 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్స్ లో రిలీజ్ కావడమే ఇందుకు కారణం. టికెట్ ధరలు పరిశీలిస్తే..
-
బెంగళూరు: ఐమాక్స్ 3డీ ఫార్మాట్.. రూ.1450
-
పూణె: 4డీఎక్స్ 3డీ.. రూ.1200
-
ఢిల్లీ: ఎన్ సీఆర్.. రూ.1000
-
ముంబయ్: రూ.970
-
కోల్ కతా: రూ.770
-
అహ్మదాబాద్: రూ.750
-
ఇండోర్: రూ.700
-
హైదరాబాద్: 4డీఎక్స్ 3డీ.. రూ.350
-
విశాఖపట్నం: రూ.210 (అంచనా)
… ఈ టికెట్ ధరలు సాధారణ సీటింగ్ కు మాత్రమే. రిక్లైనర్ సీటింగ్ ధరలు తెలియాల్సి ఉంది. ట్యాక్స్ అదనం. త్వరలోనే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 16న సినిమా విడుదలవుతోంది.