బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్.. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. ‘ఈ వారం ఫలానా వ్యక్తి ఎలిమినేట్ అవడం ఖాయం’ అంటూ, ఏకంగా సోమవారం నుంచే లీకులు బయటకొస్తున్నాయి. ఆ లీకుల ప్రకారమే జరుగుతున్నాయి అన్నీ. హేమ నుంచి రోహిణి వరకూ ఇదే తంతు జరిగింది. హేమ, ఆ తర్వాత జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి.. ఇలా ఇప్పటివరకూ నలుగురు ఎలిమినేట్ కాగా, ఐదో ఎలిమినేషన్‌కి అషు రెడ్డి ఔట్ అయిపోయింది.
ఓట్లు తక్కువ వచ్చాయా.? ఇక, హౌస్‌లో ఆమె వుండడం వల్ల ఉపయోగం లేదని బిగ్ బాస్ నిర్వాహకులు అనుకున్నారా.? అన్న విషయాలు పక్కన పెడితే, బొత్తిగా ఈసారి బిగ్‌బాస్ అస్సలేమాత్రం పస లేకుండా సాగుతోందనీ, విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిందన్న అభిప్రాయాలు మాత్రం సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. వాటికి, అషు రెడ్డి వికెట్ డౌన్‌తో మరింత బలం చేకూరినట్లయ్యింది.
అన్నట్టు, అషు రెడ్డి కూడా తాను ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నాననే విషయాన్ని ముందుగానే గుర్తించినట్టుంది. హౌస్‌లో డ్రమెటిక్‌గా మాత్రమే ఆమె కార్యకలాపాలు సాగాయి. ఫైనల్‌గా ఆమెలోని ఎనర్జీని చూపించెయ్యాలనుకున్నారో ఏమో.. మాంఛి డాన్స్ వేయించేశారు ‘జిగేలు రాణి’ అంటూ. అది కూడా ఓ టాస్క్‌లో.
ఇక, ఎలిమినేషన్ జరుగుతున్న సమయంలో అస్సలేమాత్రం టెన్షన్‌తో కన్పించలేదు అషు రెడ్డి. పక్కనే వున్న హిమజ కూడా, అషు వెళ్ళిపోతుందనే భావనతోనే వుంది. శివజ్యోతి ఏడుపులు మామూలే. హౌస్‌లో అందరికీ వ్యవహారం తెలిసిపోయిందా.? అన్నట్టు వ్యవహరించారు ఎలిమినేషన్ ఎపిసోడ్ సందర్భంలో. ఫస్ట్ సీజన్లోగానీ, సెకెండ్ సీజన్లోగానీ లేని ఈ ‘స్క్రిప్టెడ్’ వ్యవహారం ఇప్పుడే ఎందుకు జరుగుతోంది.? ఏమో, బిగ్‌బాస్ నిర్వాహకులకే తెలియాలి.
460006 2118Aw, this became an very nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a quite excellent article but exactly what do I say I procrastinate alot and by no indicates discover a approach to get something completed. 732001
365668 118356youve gotten an crucial weblog right here! would you wish to make some invite posts on my weblog? 233315