టీమిండియా వరల్డ్ కప్ విజేత కావాలని ఎంతమంది భారతీయులు కోరుకున్నారో, పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించానలి కూడా అంతమంది భారతీయులూ కోరుకున్నారు. అయితే, ఇటీవలి కాలంలో కీలక మ్యాచ్లలో పీవీ సింధు ఫెయిల్ అవుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఫైనల్ ఫోబియాతో సతమతమవుతూ వచ్చింది పీవీ సింధు.
కానీ, ఈసారి ఫైనల్ ఫోబియాని దరిచేరనివ్వలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ని సొంతం చేసుకుంది. గతంలో ఎవరి చేతుల్లో అయితే సువర్ణావకాశం చేజార్చుకుందో ఆ ఒకుహురపైనే అదరగొట్టేసింది. 21-7, 21-7 తేడాతో పీవీ సింధు, ఒకు హురపై విజయం సాధించిందంటే, ఎంత ఏకపక్షంగా మ్యాచ్ సాగిందో అర్థం చేసుకోవచ్చు. మన తెలుగుమ్మాయ్ పీవీ సింధు, నాలుగు దశాబ్దాల తర్వాత భారత్కి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టైటిల్ని గెల్చుకోవడం పట్ల దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.
పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు.. పీవీ సింధు సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పీవీ సింధు ఘనతను కొనియాడారు.
మరోపక్క పీవీ సింధు తల్లి విజయ, తన కుమార్తె సాధించిన ఘనత పట్ల హర్సం వ్యక్తం చేస్తూ, ఫైనల్లో ఏమాత్రం ఒత్తిడి లేకుండా సింధు ఆడిందని పేర్కొన్నారు. పీవీ సింధు తల్లి విజయ జన్మదినం నేడు. ‘నా పుట్టినరోజునాడు నా కుమార్తె నాకే కాదు, భారతదేశానికే ఓ గొప్ప బహుమతిని ఇచ్చింది..’ అంటూ సింధు తల్లి విజయ చెమర్చిన కళ్ళతో ఆనందాన్ని పంచుకున్నారు.
605528 536245Thank you for this. Thats all I can say. You most surely have created this into something thats eye opening and important. You clearly know so considerably about the subject, youve covered so numerous bases. Fantastic stuff from this part of the internet. 428354
922059 265678bmmzyfixtirh cheapest phentermine zero health professional prescribed qrdzoumve buy phentermine diet pill iixqnjouukkebr 604172
978726 22232It is hard to locate knowledgeable men and women on this topic, but you sound like you know what you are talking about! Thanks 791417