యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.? మీరు అనుకున్నది కరెక్టే కానీ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఏఆర్ రెహమాన్ డబ్బింగ్ సినిమా పాటలే ఎక్కువగా వింటుంటారు. డబ్బింగ్ సినిమాల సాంగ్స్ అయినా ఒరిజినల్ వెర్షన్స్ లాగా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్ అవుతుంటాయనేది వేరే విషయం అనుకోండి. ఏఆర్ రెహమాన్ చివరిగా తెలుగులో మ్యూజిక్ అందించిన సినిమాలు మహేష్ బాబు ‘నాని’ అండ్ పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’.
ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ పీరియడ్ లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఫిక్స్ కాలేదు. మొదటి నుంచి అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నప్పటికీ రీసెంట్ గా తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ‘సాహో’ తరహాలోనే ఒక్కో పాటని ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఏఆర్ రెహమాన్ ని రంగంలోకి దింపనున్నారట.
ఇప్పటికే దీనికి సంబందించిన సంప్రదింపులు మొదలయ్యాయట.. ఈ చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం, ఏఆర్ రెహమాన్ ప్రభాస్ 20వ సినిమాకి మ్యూజిక్ చేయడం దాదాపు ఖరారైందని, ఈ చిత్ర సాంగ్స్ రైట్స్ తీసుకున్న బాలీవుడ్ మ్యూజిక్ సంస్థ టీ సీరీస్ కూడా ఏఆర్ రెహమాన్ అయితే అన్ని లాంగ్వేజస్ లోనూ పేరుంది గనుక పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని వారు కూడా సుముఖంగానే ఉన్నారట. మరి అన్నీ సెట్ అయితే త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
820915 670326Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 33840
105752 133662Likely to commence a business venture about the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects a lot more via the www often. earn money 815624