ఓ రాష్ట్ర రాజధానిని నిర్మించేందుకు వందేళ్ళు పడుతుందా.? వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేటోడు మహా మేధావి అని ఊరకే అన్లేదు.! అలాగని, సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయ్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చిన మరో ఆణిముత్యమిది. ‘రాజధాని కోసం 20 లక్షల కోట్లు ఖర్చవుతుంది.. వందేళ్ళ సమయం పడుతుంది..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం సర్వత్రా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
రాష్ట్రానికి ఏం దరిద్రం పట్టిందోగానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక ఏళ్ళు గడుస్తున్నా రాజధాని లేకుండా పోయింది. బహుశా ఏదన్నా శాపం వుండి వుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. లేకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేస్తున్నవారు, రాజధాని అమరావతిని దెయ్యాల రాజధానిగా ఎలా అభివర్ణిస్తారు.?
ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్టుగానే మంత్రులు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో అయితే క్లారిటీ వచ్చేస్తుంది. రాజధాని అమరావతికి ఇరవై లక్షల కోట్లువుతుందా.? వినే జనాలు ఎలా కనిపిస్తున్నారట ప్రభుత్వ పెద్దలకి.? పైగా, వందేళ్ళ సమయం పడుతుందట రాజధాని నిర్మాణానికి.
ఇది రాకెట్ల యుగం.! జస్ట్ నిమిషాల వ్యవధిలో అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చేస్తున్నాం. అలాంటిది, రాజధాని అమరావతి నిర్మాణానికి వందల ఏళ్ళ సమయం పడుతుందా.? జపాన్ మీద అణుబాంబు దాడి జరిగితే, సర్వనాశనమైపోయిన ఆ దేశం ఎంత వేగంగా కోలుకున్నదీ ప్రపంచం చూసింది.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేయాల్సి వచ్చినాగానీ, జస్ట్ ఓ ఐదు నుంచి పదేళ్ళు సరిపోతుంది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో. వేల కోట్లు పెట్టి బుల్లెట్ రైళ్ళను తీసుకొస్తున్నాం.. వందల కోట్లు వెచ్చించి ఎత్తయిన విగ్రహాలు పెట్టేస్తున్నాం.. అలాంటిది, ఆరు కోట్ల మంది ఆంధ్రుల కోసం రాజధానిని నిర్మించుకోలేమా.?
‘మాకు చేతకాదు..’ అని వైసీపీ గనుక ఒప్పేసుకుంటే, చేతులెత్తేస్తే.. ప్రజలే చందాలు వేసుకుని రాజధానిని నిర్మించుకుంటారేమో.! సిగ్గు పడాలి కదా, రాష్ట్రాన్ని పరిపాలించిన పరిపాలిస్తున్న రాజకీయ నాయకులకి.. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్ళు పూర్తయినా.. రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియని పరిస్థితి అంటే.? అంటూ సోషల్ మీడియా వేదికగా జనం ఏకి పారేస్తున్నారాయె.!
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
24518 616696Thank you for your very good data and feedback from you. san jose used car 758259
505521 441139There is noticeably a bundle comprehend this. I suppose you made specific good points in functions also. 214490
Wonderful, what a weblog it is! This weblog provides helpful data to us,
keep it up.
Wow! This blog looks just like my old one!
It’s on a totally different topic but it has pretty much the same page layout and design. Great choice of colors!
Having read this I believed it was rather informative.
I appreciate you spending some time and energy to put this information together.
I once again find myself personally spending a lot of time both reading and leaving
comments. But so what, it was still worthwhile!
808870 479590Id always want to be update on new content on this site , saved to fav! . 718262
93571 613893The particular New york Diet can be an highly affordable and versatile eating greater tool built for time expecting to loose fat along with naturally keep a healthful day-to-day life. la weight loss 759686