Switch to English

రోజా ఈజ్ బ్యాక్.! మంత్రి పదవి ఇందుకే ఇచ్చారేమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

సరిపోయింది సంబరం.! రాష్ట్రానికి రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారుగా.? అన్న ప్రశ్నకీ జవాబు ఇవ్వరు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.! కానీ, తిట్ల పంచాంగంలో మాత్రం వైసీపీ నేతలు, అందునా మంత్రులు మాస్టర్ డిగ్రీలు చేసేశారు.

అసలు రాష్ట్రంలో మంత్రులు ఎందుకున్నారు.? అంటే, ఇంకెందుకు.. రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడానికన్నట్టు తయారైంది వ్యవహారం. రోజూ మీడియాకెక్కి బూతులు తిడుతున్నారు కదా.? కనీసం అసెంబ్లీ సమావేశాల సమయంలో అయినా, కాస్త నోటికి సెన్సార్ వుండాలి కదా.? అంటే, ఛత్.. అసలు మంత్రి పదవి వచ్చిందే విచ్చలవిడిగా చెలరేగిపోవడానికన్నట్లు వ్యవహరిస్తుంటే.. ఇంకేం మాట్లాడగలం.?

మంత్రి రోజా తన శాఖకు సంబంధించి (పర్యాటకం) రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఏమన్నా మాట్లాడతారనుకుంటే, ఆ విషయాన్ని పక్కన పెట్టేసి, ‘మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అవాకులు చెవాకులు పేలతావా.?’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ మీద తిట్ల దండకం అందుకున్నారు.

అంతేనా, ‘మా కొడాలి నాని అన్న గడ్డంలోని తెల్ల వెంట్రుకుని కూడా పీకలేరు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా. అయినా, ఆ వెంట్రుకలతో ఎవరికి పని.? ఆ మాత్రం ఇంగితం లేకుండా మంత్రి ఎలా మాట్లాడారు.? మాజీ మంత్రి నారా లోకేష్ మీద ‘వాడు.. వీడు..’ అంటూ విరుచుకుపడిపోయారు రోజా.

వావ్.! మంత్రి రోజా భాషా ప్రావీణ్యం అదిరిపోయింది కదూ.! ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని ప్రశ్నిస్తే మంత్రిగా రోజా ఇమేజ్ కాస్త పెరుగుతుందేమో.! పోలవరం ప్రాజెక్టు విషయంలో మాట్లాడితే, ఆమెకు విషయ పరిజ్ఞానం వుందని జనం నమ్మే అవకాశం వుంటుంది. కనీసం రైల్వే జోన్ గురించి ప్రస్తావించినా రోజాని రాజకీయ నాయకురాలిగా గుర్తించొచ్చు. అవి మానేసి ఏంటీ తిట్ల పంచాయితీ.? మహిళా లోకానికే మాయని మచ్చ.. అంటూ నెటిజనం తిట్టుకుంటున్నారు మంత్రి రోజాని.

అవసరమా ఇదంతా.? విలువైన ప్రజాధనాన్ని వెచ్చించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. లక్షలు, కోట్లు ఖర్చవుతున్నాయి ఈ సమావేశాల నిర్వహణ కోసం. మంత్రులు తమ శాఖల మీద అవగాహన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ, తిట్ల పంచాంగం మీద అవగాహన పెంచుకోవడం శోచనీయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...