కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీరిలో సామాన్యుల నుంచి పొలిటీషియన్స్, సినిమా సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. ఇప్పటికే కొందరు సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారికి బలైపోగా కోలీవుడ్ లో మరో నటుడు మృతి చెందడం విషాదం నింపుతోంది. తమిళ సినిమాల్లో పలు పాత్రల్లో నటించిన నితీశ్ వీర కరోనాతో పోరాడి చనిపోయారు. ఇటివల అనారోగ్యానికి గురైన నితీశ్ కరోనా సోకినట్టు వెల్లడైంది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఈక్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో డాక్టర్లు విఫల ప్రయత్నం చేసినా ఆయన ప్రాణాలు కాపాడలేక పోయారు. ఆయన మృతితో కోలీవుడ్ మరో నటుడ్ని కోల్పోయినట్టైంది. నితీశ్ పలు సినిమాల్లో క్యారెక్టర్, కామెడీ పాత్రలు చేశారు. రజినీకాంత్ కాలా సినిమాలో కీలక పాత్ర పోషించారు. థనుష్ నటించిన అసురన్ లో కూడా కీలకపాత్ర పోషించారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.
706836 619330This is an exceptional article and I completely realize where your coming from within the third section. Perfect read, Ill regularly follow the other reads. 449452
238411 546771Yeah bookmaking this wasnt a bad decision wonderful post! . 870733