Switch to English

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ‘కులం కంపు’కి కారణమెవరు.?

దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్ని చూసి అసహ్యించుకుంటోందంటే దానిక్కారణం.. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్ళుగా రాజ్యమేలుతున్న ‘కులం కంపు’ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. టీడీపీ హయాంలో ‘కులం’ పేరుతో రాజకీయాలు జరిగాయి.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో ఆ ‘కులం’ పేరుతో రాజకీయాలు ఇంకా పెరిగిపోయాయి.

చంద్రబాబు ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ‘కమ్మ’ ముద్ర వేస్తే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ‘రెడ్డి’ ముద్ర వేసింది. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టు అప్పట్లో చంద్రబాబు ‘కమ్మ’ రాజకీయాలే చేశారు తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ ‘రెడ్డి’ రాజకీయాలే నడుస్తున్నాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

ఇక, తాజాగా డాక్టర్‌ సుధాకర్‌ తప్ప తాగి నడి రోడ్డు మీద నానా యాగీ చేస్తే ‘దళిత రాజకీయం’ తెరపైకొచ్చింది. అసలు అలా ఆయన మారడానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనన్నది టీడీపీ ఆరోపణ. ‘దళితుడితో నాటకమాడిస్తున్నారు’ అంటూ నిస్సిగ్గుగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మానసిక స్థితి బాగాలేదంటారు.. టీడీపీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నాడంటారు.. అధికార పార్టీ దగ్గర అస్సలేమాత్రం స్పష్టత లేదు డాక్టర్‌ సుధాకర్‌ని విమర్శించే క్రమంలో.

మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో ఏం జరిగిందో చూశాం. ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వున్నప్పుడే ఆయన మీద ‘కులం’ ముద్ర వేసింది అధికార పార్టీ. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ‘కులం’ పేరుతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఆరోపణలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? టీడీపీని ఇంటికి పంపించి వైసీపీని అధికారంలోకి ప్రజలు తీసుకొచ్చింది.. చంద్రబాబు తరహాలోనే కుల రాజకీయాలు చేస్తారని కాదు కదా.! ఈ ప్రశ్న రాష్ట్ర ప్రజల నుంచి దూసుకొస్తోంది అధికార పార్టీ మీద.

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు, కానీ కులం పేరు ఆపాదించడమేంటి.? డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో అయినా అంతే.. మరొకరైనా అంతే. అసలు విషయం పక్కన పడేసి, నిస్సిగ్గుగా కుల రాజకీయాలు చేయడం ఇటు టీడీపీకి తగదు, అటు వైసీపీకి అసలే మంచిది కాదు. చాలా విషయాల్లో చంద్రబాబుకీ వైఎస్‌ జగన్‌కీ స్పష్టమైన పోలికలున్నాయి. రాష్ట్ర ప్రజానీకానికి ఈ విషయమై పూర్తిస్థాయి స్పష్టత వుంది. కుల రాజకీయాల విషయంలో వైసీపీ, టీడీపీ దొందూ దొందే.!

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

ఎక్కువ చదివినవి

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్ర ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

సినిమా షూటింగ్స్ పునఃప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సినీ ప్రముఖులెవరూ తనను పిలవలేదన్న బాలకృష్ణ వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘మంత్రితో కలిసి అందరూ భూములు పంచుకుంటున్నారా..’ అంటూ ఆయన చేసిన...

తెలంగాణలో మరిన్ని సడలింపులు.. రాత్రివేళా బస్సులు.!

‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేంత సాధన సంపత్తి మనదేశంలో లేవు. అందువల్ల లాక్ డౌన్ ముమ్మాటికీ పాటించాల్సిందే. మన తీసుకునే ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష’’ – ఇటీవల పలు సందర్భాల్లో...

పోతిరెడ్డిపాడుపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..

కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు. రాయలసీమ కరువు పోగొట్టడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతామని సీఎం జగన్ చెప్పడంతో రెండు రాష్ట్రాల్లో...

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

మహేష్ బాబు ‘టాటూ’కి రీజన్ ఏంటో తెలుసా??

దాదాపు 5 నెలల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మే 31న కృష్ణ గారి పుట్టిన రోజున తన తదుపరి సినిమా 'సర్కారు వారి పాట' సినిమాని అనౌన్స్ చేయడమే కాకుండా...