బుల్లితెరపై రవి, లాస్య జోడి అంటే ఇదివరకు చాలా క్రేజ్ ఉండేది. ప్రోగ్రాం ఏదైనా ఒకరు ఉన్నారంటే మరొకరిని కచ్చితంగా కోరుకునే వారు ప్రేక్షకులు. అయితే కారణాలు తెలియవు కానీ వీరి మధ్య విబేధాలు తలెత్తి ఒకరు ఉంటే మరొకరు ప్రోగ్రామ్ చేయలేము అనే స్థాయికి పెరిగాయి. నెమ్మదిగా వీరిద్దరి గురించి వార్తలు రావడం కూడా తగ్గిపోయాయి. అయితే లేటెస్ట్ గా బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలవ్వబోతున్న సందర్భంగా మళ్ళీ వీరిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ యాజమాన్యం వీరిద్దరినీ బిగ్ బాస్ హౌజ్ లోకి పంపాలని అనుకుంటున్నారట. వీరిద్దరూ కలిసి హౌజ్ లో ఉంటే అది తమ రేటింగ్స్ కు బాగా కలిసొస్తుందని వారు అనుకున్నారు. అయితే ఈ ప్రపోజల్ ను ఇద్దరి ముందు ఉంచితే దానికి ఇద్దరూ సముఖంగా లేరట. ఒకరు హౌజ్ లో ఉంటే మరొకరు ఉండడానికి అస్సలు ఇష్టపడట్లేదట. దీంతో చేసేదేం లేక బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఇద్దరిలో ఒకరినే ఎంపిక చేసుకోవాలని డిసైడ్ అయింది. అది ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో డిసైడ్ చేస్తారు.
మరోవైపు నగ్నం సినిమాతో పాపులర్ అయిన శ్రీరాపాకను కూడా బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించగా రోజుకి లక్ష చొప్పున పారితోషికం ఇస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పడంతో బిగ్ బాస్ వాళ్ళు వెనక్కి తగ్గక తప్పలేదట.
668958 390561An interesting discussion is price comment. I believe that you need to write extra on this topic, it may well not be a taboo subject but typically individuals are not enough to speak on such topics. To the next. Cheers 6347