సంక్రాంతి కానుకగా విడుదలై అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ‘జులాయి’, ‘s/o సత్యమూర్తి’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమా అని కూడా చెప్పచ్చు.
మొదటి 7 రోజుల్లో 84.86 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసిన ఈ సినిమా 15రోజుల్లో 116.44 కోట్లతో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ గా నిలిచింది. సంక్రాంతి తర్వాత వచ్చిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడంతో అల వైకుంఠపురములో బాక్స్ ఆఫీస్ వద్ద డ్రీం రన్ ని కొనసాగిస్తూ 3వ వారం పూర్తయ్యే టైంకి 120 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు ఆంధ్ర – తెలంగాణలో టాప్-3 షేర్స్ అంటే బాహుబలి 2(198.7 కోట్లు), అల వైకుంఠపురములో (125.67 కోట్లు) మరియు సరిలేరు నీకెవ్వరు (115.4 కోట్లు).
‘అల వైకుంఠపురములో’ ఆంధ్ర – తెలంగాణ 22 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 42.7 కోట్లు
సీడెడ్ – 18.1 కోట్లు
గుంటూరు – 10.5 కోట్లు
ఉత్తరాంధ్ర – 20.2 కోట్లు
తూర్పు గోదావరి – 11.1 కోట్లు
పశ్చిమ గోదావరి – 8.5 కోట్లు
కృష్ణా – 10.25 కోట్లు
నెల్లూరు – 4.3 కోట్లు
22 డేస్ మొత్తం షేర్ – 125.67 కోట్లు
కర్ణాటక – 8.96 కోట్లు
కేరళ – 1.23 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 2.13 కోట్లు
ఓవర్సీస్ – 18.02 కోట్లు
వరల్డ్ వైడ్ 22 డేస్ షేర్ – 155.99 కోట్లు
891594 405096Its onerous to search out knowledgeable individuals on this subject, nevertheless you sound like you already know what you are talking about! Thanks 816411
140751 556858This really is a excellent weblog. Keep up all of the function. I too adore to blog. This is wonderful everybody sharing opinions 125387
211695 892542Any way Im going to be subscribing for a feed and I hope you article once again soon 376700