గత ఏడాది బాలీవుడ్ లో మిషన్ మంగళ్ అనే చిత్రాన్ని తెరకెక్కించి మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు దాదాపుగా 250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన దర్శకుడు జగన్ శక్తి. ఈయన తదుపరి చిత్రాన్ని కూడా అక్షయ్ కుమార్ హీరోగా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లోనో లేదంటే వచ్చే ఏడాదో అక్షయ్ కుమార్, జగన్‌ల మూవీ ప్రారంభం అయ్యేది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న జగన్ శక్తి ఇటీవల ఒక పార్టీలో ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయాడట.
జగన్ శక్తి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దాంతో ఆయనకు చికిత్స చేయించేందుకు ఆర్థికంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఈ విషయం తెలిసిన అక్షయ్ కుమార్ మంచి మనసుతో జగన్ చికిత్స కోసం ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానంటూ ముందుకు వచ్చాడట. ఆయనతో పలువురు గతంలో పని చేశారు.. ఇంకా ఎంతో మందితో ఆయన వర్క్ చేశారు. కాని అక్షయ్ కుమార్ మాత్రమే ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలం అంటూ చెప్పుకుంటారు. కాని ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే అసలైన హీరో ఎవరు అనేది తెలుస్తుంది. గతంలో కూడా అక్షయ్ కుమార్ సైనికుల కోసం మరియు తుఫాన్ బాధితుల కోసం భూరీ విరాళంను అందించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక దర్శకుడి కోసం లక్షలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చి నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం జగన్ శక్తి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే ఉందని.. మరికొన్ని రోజులు ఆగితే కాని చెప్పలేమని వైధ్యులు అన్నారట. ముంబయిలోని ప్రముఖ హాస్పిటల్లో జగన్ శక్తికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
534986 681632Excellent activity! 707092
934130 400224There is noticeably a bundle to realize about this. I assume you produced specific good points in functions also. 152799
278853 781192IE still is the marketplace leader and a huge portion of folks will pass over your wonderful writing because of this problem. 430031
488755 729378Glad to be one of several visitants on this incredible internet web site : D. 876716