నాగచైతన్య, సమంత విడిపోయారు. ఆ విషయాన్ని స్వయంగా ఇరువురూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరి మధ్యా వైవాహిక జీవితంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నంలో విఫలమవడంతో.. విడాకులే చివరి మార్గంగా ఎంచుకున్నారు. ఎవరి జీవితం వారిది.
ఇంతకీ, నాగచైతన్య – సమంత ఎందుకు విడిపోయారు.? సోషల్ మీడియాలో సమంత పెట్టే హాటు హాటు ఫొటోలు నాగచైతన్యకి నచ్చలేదా.? కొన్నాళ్ళ క్రితం సమంత, ఆమె వ్యక్తిగత సహాయకుడితో దిగిన ఫొటో కారణంగానే వివాదం వచ్చిందా.? ఇలా బోల్డన్ని ప్రశ్నల్ని తెరపైకి తెచ్చి విశ్లేషించేసింది ఓ న్యూసెన్స్ బురద ఛానల్.
పేరుకే, ‘మెరుగైన సమాజం కోసం’ అనే ట్యాగ్.. కానీ, నడిచేదంతా బురద వ్యవహారమే. ఇంకా నయ్యం.. సమంతలా ఓ యాంకర్, నాగచైతన్యలా మరో యాంకర్.. పోజులిచ్చేసి.. ఇద్దరూ తిట్టుకుంటున్నట్టు, కొట్టుకుంటున్నట్టు.. ‘అతి’ చేసెయ్యలేదు.
గుర్తుంది కదా.? కొన్నాళ్ళ క్రితం సినీ నటి శ్రీదేవి దుబాయ్‌లో చనిపోతే, బాత్‌టబ్‌లో ఆమె మృతదేహం ఎలా పడివున్నదీ ఓ న్యూస్ రీడర్ చేసి చూపించేసి.. అందర్నీ విస్మయానికి గురిచేశారు. అదీ ఆ న్యూసెన్స్ ఛానెల్ రేంజ్. ఏదన్నా ఓ విషయం జరిగితే, దానికి తన పైత్యాన్నంతా జోడించేసి.. జనానికి పిచ్చెక్కించెయ్యడమే పనిగా పెట్టుకుంది ఆ ఛానల్.
ఇటీవల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు సదరు న్యూస్ ఛానల్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. విషయం ఏదైనా.. న్యూసెన్స్ బురద మాత్రం తప్పడంలేదంతే. సమంత – నాగచైతన్య.. ఓ అవగాహనతో పెద్దగా గొడవల్లేకుండానే విడిపోయి వుండొచ్చు. ఈ బురద ఛానల్ కథనాల్ని ఇద్దరూ చూసి, వాటి ప్రభావంలో పడితే.. రోడ్డున పడి కొట్టుకునే పరిస్థితి వచ్చినా రావొచ్చు.
596555 854113of course like your web site but you have to test the spelling on several of your posts. 321387
475367 503548I actually like reading by means of and I believe this web site got some genuinely utilitarian stuff on it! . 631716
89633 841962Hey There. I discovered your blog utilizing msn. That can be a very smartly written write-up. I will make positive to bookmark it and come back to read a lot more of your helpful details. Thanks for the post. I will certainly return. 723456
403264 752670I believe other site owners really should take this website as an example , really clean and fantastic user genial style . 82953
464865 877005Yay google is my king aided me to locate this excellent website ! . 676425