Switch to English

బిగ్‌బాస్‌ తెలుగు-5 : ప్రియ వ్యాఖ్యలతో రచ్చరచ్చ – ఎపిసోడ్ – 16

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ లో సోమవారం వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసి చూస్తారు.. కంటెస్టెంట్స్ కారాలు మిరియాలు నూరుతూ రచ్చ చేసేందుకు సిద్దం అవుతారు. ప్రతి వారం నామినేషన్‌ పక్రియలో భాగంగా ఒకరిపై ఒకరు చేసే వ్యాఖ్యలతో ఎవరి మనసులో ఏం ఉంది అనే విషయం క్లారిటీ వస్తుంది. సోమవారం ఎపిసోడ్‌ లో కూడా రచ్చ రచ్చ గా కంటెస్టెంట్స్‌ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి మరీ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఒక బ్యాచ్ ను గతంలో ఎప్పుడు చూడలేదు అనిపించే విధంగా వీరు ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ప్రతి బ్యాచ్ లో ఒకరు ఇద్దరు హైపర్స్ ఉండేవారు. కాని ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు కూడా హైపర్ ను సమయం వచ్చినప్పుడు చూపిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌ లో ప్రియా, లహరి, రవి, జెస్సీ, నటరాజ్‌ మాస్టర్ ల హైపర్ ను చూడవచ్చు. ముఖ్యంగా లహరి పై ప్రియ చేసిన అభియోగం మరీ దారుణం అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఇన్ని రోజులుగా ప్రియా ఆంటీ చాలా కూల్‌ అంటూ ఆమెను మద్దతుగా ఇచ్చి మాట్లాడిన వారు ఇప్పుడు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. రెండు సార్లు నువ్వు అబ్బాయిలతో ఎక్కువగా ఉంటున్నావు. నాకు కలిసే అవకాశం ఎక్కడ ఇస్తున్నావు. అర్థరాత్రి సమయంలో హగ్గులు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆ సమయంలో లహరి చాలా సీరియస్‌ అయ్యింది. అదే సమయంలో రవి కూడా మాట్లాడుతూ నా కూతురుకు ఇది అర్థం అయితే నన్ను ఎలా చూస్తుంది. మీకు పిల్లలు ఉన్నారు కదా అంటూ రవి చాలా వైల్డ్‌ గా రియాక్ట్‌ అయ్యాడు. మరీ ఇలా మాట్లాడుతారు అనుకోలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియాలో ప్రియాపై నెగటివ్‌ కామెంట్స్ తీవ్రంగా వస్తున్నాయి. ఇన్నాళ్లు ఈమెకా మేము సపోర్ట్‌ చేసింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

నామినేషన్స్‌ ప్రారంభంకు ముందు విశ్వ తన ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ షణ్ముఖ్‌ ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాలుగు నెలలు ఇంటి అద్దె చెల్లించలేక పోయాను. పాపను స్కూల్‌ లో జాయిన్ చేసేందుకు డబ్బులు కూడా లేకపోవడం తో స్కూల్‌ కు వెళ్లి మళ్లీ తిరిగి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక కాజల్ కోరిక మేరకు మటన్ బిర్యానీ ని చేసేందుకు బిగ్‌ బాస్ అన్ని ఇచ్చి పంపించాడు. అయితే కాజల్ మాత్రమే దాన్ని వండాలి అనేది కండీషన్. ఆ మేరకు వంట జరిగింది. ఇక నామినేషన్ పక్రియ మొదలు అయ్యింది కాని సోమవారం ఎపిసోడ్‌ లో పూర్తికాలేదు. దాంతో మంగళవారం ఎపిసోడ్‌ లో నామినేషన్‌ పక్రియ కొనసాగబోతుంది. సాదారణంగా సోమవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. కాని నామినేషన్ రచ్చ రచ్చగా మారడంతో ప్రియ వ్యాఖ్యల వేడి రాజుకోవడం వల్ల తదుపరి రోజుకు వాయిదా పడింది. నామినేషన్ లో ఎవరు ఉన్నారు అనేది తదుపరి ఎపిసోడ్‌ లో చూపించబోతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...