తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని ఇరు ప్రభుత్వాల దృష్టికీ తీసుకెళ్ళారు సినీ ప్రముఖులు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి సహా పలువురు ప్రముఖులు ఈ బృందంలో వున్నారు.
ముఖ్యమంత్రుల్ని కలిసే ముందు పరిశ్రమ ప్రముఖులు పలుమార్లు సమావేశమై, పరిశ్రమలోని సమస్యలపై చర్చించి, ప్రభుత్వాలతో ఏం మాట్లాడాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఇదంతా అందరికీ తెలిసిన సంగతే. సినిమా టిక్కెట్ల వ్యవహారం, పైరసీ, పరిశ్రమకు ఇవ్వాల్సిన రాయితీలు.. ఇలా చాలా వ్యవహారాలున్నాయి.
థియేటర్లు కరోనా కారణంగా ఎదుర్కొన్న సమస్యల్నీ వాటిల్లో ప్రస్తావించారు. తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలో స్థిరపడింది. ఆ లెక్కన తెలంగాణ ప్రభుత్వానికి అందించే వినతులు ఇంకాస్త ఎక్కువగా వుంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ వినతులు మామూలే. కానీ, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించాలనిగానీ, సినిమా టిక్కెట్ల కోసం ప్రభుత్వ పోర్టల్ ఏర్పాటు చేయాలనిగానీ సినీ పరిశ్రమ పెద్దలు కోరి వుంటారా.? అవకాశమే వుండకపోవచ్చు.
కానీ, మంత్రి పేర్ని నాని మాత్రం, పరిశ్రమ పెద్దల సూచన మేరకే, రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్ల ధరల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుందని చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదంటే, పరిశ్రమ పెద్దలు తెలంగాణ ప్రభుత్వానికి ఆ దిశగా నివేదించలేదా.? లేదంటే, పరిశ్రమ పెద్దల సూచనని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందా.? ఈ వ్యవహారాలపై ఇప్పుడు స్పష్టత రావాల్సి వుంది.
ఆ స్పష్టత కంటే ముందుగా, పరిశ్రమ పెద్దలు ఇకనైనా పెదవి విప్పాల్సిందే. లేకపోతే, ‘వకీల్ సాబ్’ సినిమా సమస్యలకి పరిశ్రమ పెద్దలే కారణమని ప్రజలంతా భావించాల్సి వుంటుంది.. ‘టక్ జగదీష్’ థియేటర్లలో కాకుండా, ఓటీటీలో రిలీజవ్వడానికీ పరిశ్రమ ప్రముఖులే కారణమని భావించాల్సి వుంటుంది. దర్శకుడు దేవ్ కట్టా తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల విషయమై తీసుకుంటోన్న నిర్ణయాల్ని ఎవరూ ప్రశ్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
608436 845392Most appropriate the human race messages work to show your and present exclusive chance with unique couple. Beginer appear system in advance of raucous people will most likely always be aware most of the golden value off presentation, which can be a persons truck. finest man jokes 13389
225300 872678Nice read. I just passed this onto a buddy who was performing some research on that. He just bought me lunch since I located it for him! Thus let me rephrase: Thanx for lunch! 300679
122660 151894A thoughtful opinion and suggestions Ill use on my internet page. Youve certainly spent some time on this. Properly carried out! 841666