Switch to English

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow
Movie ఇచ్చట వాహనములు నిలుపరాదు
Star Cast సుశాంత్, మీనాక్షి చౌదరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి
Director ఎస్ దర్శన్
Producer రవిశంకర్ శాస్త్రి, ఏక శాస్త్రి , హరీష్ కోయల గుండ్ల
Music ప్రవీణ్ లక్కరాజు
Run Time 2hr 31 Mins
Release ఆగస్టు 27, 2021

అల వైకుంఠపురములో చిత్రంలో మెరిసిన సుశాంత్ తిరిగి లీడ్ రోల్ లో నటించిన చిత్రం ఇచట వాహనములు నిలుపరాదు. టైటిల్ నుండి ఆసక్తికరంగా అనిపించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

అరుణ్ (సుశాంత్) జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ తిరిగే కుర్రాడు. ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో పనిచేసే అరుణ్, అక్కడే ఇంటర్న్ గా చేరిన మీనాక్షి (మీనాక్షి చౌదరి)ను చూసి ఇష్టపడతాడు. ఆమె అక్కడ లోకల్ రాజకీయ నాయకుడు అయిన నరసింహ యాదవ్ (వెంకట్) చెల్లెలు. ఒకరోజు యాదవ్ ఊర్లో లేని సమయంలో అరుణ్ ను తన ఇంటి దగ్గర కలుసుకోవడానికి ఒప్పుకుంటుంది మీనాక్షి. అయితే ఆమెను సర్ప్రైజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఆమె ఇంటికి వెళ్లాను అనుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు.

అయితే అక్కడ అప్పటికే ఒక క్రైమ్ జరుగుతుంది. అక్కడి సొసైటీ జనాలు క్రిమినల్ ఇంకా లోపలే ఉన్నాడు అనుకుని ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ మూసేస్తారు. అయితే లోపల ఉండిపోయిన అరుణ్ ఏ క్రిమినల్ అని అందరూ అనుకుంటారు. ఈ నేపథ్యంలో అరుణ్ ఏం చేసాడు? తనే అమాయకుడు అని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు? అసలు ఈ క్రైమ్ వెనకాల ఉన్నది ఎవరు?

తెర మీద స్టార్స్‌:

సుశాంత్ ఈ సాఫ్ట్ రోల్ ను సరిగా క్యారీ చేయడంలో విఫలమయ్యాడు. చాలా చోట్ల సుశాంత్ నటన నీరసంగా సాగింది. మీనాక్షి చూడటానికి బాగుంది కానీ ఆమె డబ్బింగ్ మేజర్ డ్రాబ్యాక్. వెంకట్ చాలా సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు కానీ ఇంకా బాగా చేసుండాల్సింది. వెన్నెల కిషోర్ ఉన్నంత సేపూ నవ్వించాడు.

పులిగా ప్రియదర్శికి ముఖ్యమైన పాత్ర పడింది కానీ ఆ రోల్ ను ఎందుకో సరిగా ఉపయోగించుకోలేదు. అభినవ్ బాగా చేసాడు. రవివర్మ నెగటివ్ రోల్ లో మెప్పించాడు. సునీల్ క్యామియో బాగుంది.

తెర వెనుక టాలెంట్:

కథగా ఎంచుకున్న పాయింట్ చాలా వీక్ గా ఉంది. పైగా దానిపై సరిగా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా సాగింది. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఏదో అలా సాగిపోతాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం పర్లేదు. అయితే విజువల్ గా సాంగ్స్ అంతలా ఆకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గట్టిగా వినబడింది కానీ ఎఫెక్టివ్ గా లేదు. ఎడిటింగ్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ సోసో గా సాగింది. మిగిలిన డిపార్ట్మెంట్స్ మాములే.

విజిల్ మోమెంట్స్:

  • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని టెన్స్ సన్నివేశాలు

బోరింగ్ మోమెంట్స్:

  • సాగతీతగా అనిపించే ఫస్ట్ హాఫ్
  • నవ్వు తెప్పించని కామెడీ.

విశ్లేషణ: సినిమా మొదలుకావడమే మనం దీని నుండి ఎలాంటి ఔట్పుట్ ఆశించవచ్చో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బైక్ షోరూమ్ లో జరిగే తతంగమంతా చాలా ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. పైగా హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ అంత కన్విన్సింగ్ గా డిజైన్ చేసుకోలేదు. సినిమాకు మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయిన నరసింహ యాదవ్, భూషణ్ ల మధ్య గొడవే సరిగా అనిపించదు, ఇక దాని తర్వాత జరిగేదంతా ఎందుకో ప్రేక్షకుడికి అర్ధం కాదు. ఇంటర్వెల్ గా సాగదీసి సరిగ్గా దాని ముందు మెయిన్ కథలోకి వెళ్తాడు దర్శకుడు.

సెకండ్ హాఫ్ మొదలు బాగుంటుంది. కొన్ని టెన్స్ మూమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. అయితే అలాంటి ఆశలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదని సినిమా కొంచెం ముందుకు కదలాగానే అర్ధమైపోతుంది. అయితే సినిమాలో ఏమైనా కాపాడే అంశాలు ఉన్నాయంటే అవి సెకండ్ హాఫ్ లో వచ్చేవే. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ మన అంచనాలకు తగ్గట్లే ముగుస్తాయి. అయితే ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారన్న జస్టిఫికేషన్ ఉండదు.

ఫైనల్ పంచ్: రాంగ్ పార్కింగ్.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...