Switch to English

మూవీ రివ్యూ: ఇష్క్- నాట్ ఏ లవ్ స్టోరీ

Critic Rating
( 2.00 )
User Rating
( 2.10 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow
Movie ఇష్క్- నాట్ ఏ లవ్ స్టోరీ
Star Cast తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌
Director య‌స్‌.య‌స్‌. రాజు
Producer ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
Music మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
Run Time 2 గంట 1 నిమిషం
Release జూలై 30, 2021

కరోనా మహమ్మారి వలన గత ఏడాది దాదాపుగా ఏడు ఎనిమిది నెలలు థియేటర్లు మూతపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి మూడు నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి. తాజాగా మళ్లీ సినిమాల సందడి మొదలైంది. అందులో భాగంగానే తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన ‘ఇష్క్‌’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ మొదటి సినిమా జాంబిరెడ్డి సక్సెస్‌. మరి ఈ సినిమా ఆయనకు సక్సెస్‌ కట్టబెట్టిందా చూద్దాం.

కథ : సిద్దార్థ్ (తేజ సజ్జ) మరియు అనసూయ (ప్రియా ప్రకాశ్‌ వారియర్‌) ఇద్దరు ప్రేమించుకుంటారు. అనసూయ బర్త్ డే సందర్భంగా మంచి ట్రీట్ ఇవ్వాలనుకున్న సిద్ధార్థ్ ఆమెను నైట్ లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాడు. అక్కడ అమెను ఓ ముద్దు కావాలని అడుగుతాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ వీరిని అడ్డుకొని చాలా ఇబ్బందులు పెడుతుంటాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ.. అసలు సిద్దార్థ్‌ ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోండి.

తెర మీద స్టార్స్ :

పక్కింటి కుర్రాడి లుక్స్ లో తేజ, పక్కింటమ్మాయి లుక్స్ లో ప్రియా వారియర్ బాగానే కుదిరారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తేజ నటన బాగుంది చెప్పాలి. నటుడిగా తేజ కు మంచి భవిష్యత్తు ఉందని జాంబిరెడ్డితోనే నిరూపితం అయ్యింది. ఈ సినిమా అందుకు మరింతగా హెల్ప్‌ అయ్యింది. ఇక విలన్ పాత్రధారి సినిమాకి మరో అసెట్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ గా నటనతో భయపెట్టాడు. ఇక మిగతా నటీనటులు పాత్రల మేరకు బాగానే రాణించారు.

తెరవెనుక టాలెంట్ :

దర్శకుడు ఎస్ ఎస్‌ రాజు కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. స్క్రీన్‌ ప్లే కూడా సాదా సీదాగా ఉంది. పలు సన్నివేశాలు రియలిస్టిక్ గా అనిపించలేదు. చాలా వరకు సన్నివేశాలు ఇంతకు ముందు చూసిన ఫీల్ ను కలిగించాయి. స్వర సాగర్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ బాగుంది. అయితే పాటల విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ లో లోపాలున్నాయి. పలు సీన్స్ సాగతీసినట్లుగా ఉన్నాయి. ఇక నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా పర్వాలేదు.

విజిల్ మోమెంట్స్ :

  • నటీనటులు పెర్ఫార్మన్స్
  • సెకండ్ హాఫ్

బోరింగ్ మోమెంట్స్ :

  • మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు..
  • ఎడిటింగ్

విశ్లేషణ : రీమేక్‌ అయినప్పటికి కొత్తగా తీసేందుకు ప్రయత్నించారు. కాని సినిమాను పూర్తి స్థాయిలో తెరకెక్కించడంలో విఫలం అయినట్లుగా అనిపించింది. పలు సందర్బాల్లో సన్నివేశాలు అర్థరహితంగా ఉండటం లేదా పునరావృతం అయినట్లుగా ఉండటం అనిపించింది. మొత్తానికి ఇష్క్‌ సినిమా నిజంగానే ఒక ప్రేమ కథ కాదు.

చూడాలా వద్దా : సినిమాలు ఏమీ లేవు కనుక టైమ్‌ మరీ ఎక్కువ ఉంటే చూడవచ్చు

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

4 COMMENTS

  1. 624022 815115Wow, superb weblog structure! How long have you been blogging for? you make blogging glance straightforward. The total appear of your web internet site is excellent, neatly as the content material! 999816

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...