Switch to English

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి. అయినా, కరోనా పట్ల రాజకీయ నాయకులకు బాధ్యత లేదు.

రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే, సామాన్యులు చాలామంది దేశవ్యాప్తంగా కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.. వందలు, వేలు.. కాదు లక్షల్లో వుంది మరణాల సంఖ్య. అయినా, రాజకీయాల్లో బాధ్యత లేదు.. రాదు. కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ అప్పుడే దేశంలోని కొన్ని రాష్ట్రాలో వెలుగు చూసినట్లు కేంద్రం స్వయానా వెల్లడించింది. మరి, కరోనా మూడో వేవ్ పట్ల రాజకీయ నాయకులు బాధ్యతగా వుండాలా.? లేదా.? ప్రభుత్వాలూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి.

లాక్ డౌన్ వెళ్ళిపోయి.. అన్ లాక్ వచ్చేసింది. త్వరలో విద్యా సంస్థలూ తెరుస్తారట. అంటే, ఇదేదో కావాలనే జనాన్ని కరోనా వైరస్‌కి బలి చేసేందుకు ప్రభుత్వాలు నడుపుతున్నవారు ప్రయత్నిస్తున్నారా.? అన్న అనుమానాలు జనంలో వ్యక్తమవుతున్నాయి. ‘ఎంత కాలం లాక్‌డౌన్‌లో వుంటాం? ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటే, అది కరోనా వైరస్ కంటే ఎక్కువ నష్టం కలిగిస్తుంది..’ అన్నది ప్రభుత్వ పెద్దల వాదన.

ఆర్థిక కార్యకలాపాలు సరే.. విద్యా సంస్థలు ఎందుకు తెరవడం.? తప్పదు మరి.. విద్యా వ్యవస్థ కూడా వ్యాపారమే అయిపోయింది కదా.? రాజకీయ నాయకులు మీటింగులు పెట్టేస్తున్నారు.. ఓ మంత్రిగారు.. పైగా డాక్టరు.. ఓ సంక్షేమ కార్యక్రమం ప్రచారం కోసం పెద్దయెత్తున జనాన్ని పోగేసి రోడ్డుమీదకు లాక్కొచ్చేశారు. ఇంకా కర్ఫ్యూ నిబంధనలు అమల్లోనే వున్నా ఆ ఘనకార్యం చేశారు సదరు మంత్రిగారు.

అధికారులు ఏం చేస్తున్నారు.? పోలీసులు ఏం చేస్తున్నారు.? ఓ ముఖ్యమంత్రి సహపంక్తి భోజనాలు షురూ చేశారు. సభ్య సమాజానికి వీళ్ళంతా ఏం సందేశం ఇస్తున్నట్లు.? రావాల్సిందే.. మూడో వేవ్ రావాల్సిందే.. అన్నట్లుంది పొలిటికల్ కోవిడియట్స్ తీరు.. అంటూ జనం ఛీత్కరించుకునే పరిస్థితి కనిపిస్తోంది సర్వత్రా.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...