ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి మీద ‘ఇసుకాసురుడు’ అనే ఆరోపణలున్నాయి. ఇంకొకాయన ‘మట్టి మాంత్రికుడు’ అనే విమర్శలున్నాయి. ఎవరి దారిన వారు దోచుకుంటే కిక్కేముంది.? అందుకే, విడివిడిగా దోచుకుంటూనే, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారట. అలా నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరు ‘బులుగు’ నేతల పంచాయితీ, అదినేత వద్దకు వెళ్ళిందట.
ఇంతకా ఎవరా బులుగు నేతలు.? అంటే, ఆ విషయం నెల్లూరు జిల్లాలో ఎవర్ని అడిగినా చెప్పేస్తారంటూ నెల్లూరు ప్రజానీకం చెప్పుకుంటున్నారు. ఇంతకీ, ఈ పంచాయితీ ఓ కొలిక్కి వచ్చిందా.? లేదా.? అన్నదానిపైనా భిన్న వాదలున్నాయి. పంచాయితీ ముదిరి పాకాన పడ్డంతో, ‘కోటరీ’ నేతలు వాటా కోరారంటూ కొత్త ఆరోపణ తెరపైకొచ్చింది.
ఈ సోషల్ మీడియా వుందే.. ‘నాకేంటి సంబంధం.?’ అని ఊరుకోదు. అందరి జాతకాల్నీ బయటపెట్టేస్తుంటుంది. ఫలానా చోట.. ఫలానా లారీల్లో మట్టి తరలించేస్తున్నారనీ.. ఫలానా ట్రాక్టర్లతో ఇసుకని దోచేస్తున్నారనీ.. సోషల్ మీడియా కోడై కూసేస్తోంది ఇసుకాసురుడి గురించీ.. మట్టి మాంత్రికుడి గురించీ. వారెవ్వా.. ఇది కదా పరిపాలన అంటే.. అని జనం ముక్కున వేలేసుకోవాల్సిందే. అయినా, నిస్సిగ్గుగా ఇసుకను దోచుకోవడమేంటి.? మట్టిని దొంగిలించడమేంటి.? అంటే, ఇప్పుడు ఇదో మంచి యాపారం మరి.
దోచుకున్నోడికి దోచుకున్నంత. వైఎస్సార్ హయాంలో తెరపైకొచ్చింది ఇసుక కుంభకోణం. అప్పట్లో ‘ఇసుకాసురులు’ అనే ఆరోపణలు అధికార పార్టీ నేతల మీద వస్తే, అప్పట్లో వైఎస్సార్ గుస్సా అయ్యారు.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గుంటూరులో అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కూడా ఇలాగే ఇసుక పంచాయితీ నడిస్తే.. మేటర్ ‘ఉన్నత స్థాయిలో’ సెటిలైపోయిందట. అలాగే, నెల్లూరు పంచాయితీ కూడా రేపో మాపో సెటిలైపోతుంది.. కానీ, దోపిడీ మాత్రం అంతకన్నా ఘనంగా జరుగుతుంది.
996030 163973Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this amazing like you organize your company at the moment. educational 913773
214353 739330Someone necessarily assist to make critically articles Id state. This is the very first time I frequented your internet page and thus far? I amazed with the analysis you created to make this actual submit incredible. Excellent activity! 126676
996804 583840How significantly of an exciting piece of writing, continue creating companion 134449
556308 8440just couldnt leave your internet website before suggesting that I truly loved the standard data a person give for your visitors? Is gonna be again ceaselessly to check up on new posts 209733