Switch to English

ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు నిజంగానే తగ్గుతున్నాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

కొత్తగా నిన్న (మే 27న) ఆంధ్రపదేశ్‌లో కొత్తగా 16,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. జరిగిన టెస్టుల సంఖ్య 84 వేలు మాత్రమే. లక్షకు పైగా టెస్టులు జరిగితే, 20 వేల పైన కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసేవేమోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోపక్క, ప్రభుత్వం చెబుతున్న మాటలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొత్తం 10 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పడుతోందన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదన. నిజమేనా.? అలాంటి సానుకూల వాతావరణం రాష్ట్రంలో కరోనా విషయంలో వుందా.? అంటే, లేదనే చెప్పాలి. కరోనా బాధితులు చాలామంది బయటకు రావడంలేదు. అంటే, అధికారికంగా టెస్టులు చేయించుకోవడంలేదు.

 

గ్రామ స్థాయిలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్ఎంపీలు తమకు అందుబాటులో వున్న కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించేసి, మందులు కూడా తామే విక్రయించేస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారితే తప్ప, బాధితులు ఆసుపత్రులకు వెళ్ళడంలేదు. మరోపక్క, ప్రాణాలు కోల్పోతున్నా.. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితి బాధితుల కుటుంబ సభ్యుల పరిస్థితి. కరోనా అంటే సవాలక్ష ఆంక్షలు.. పదిహేను రోజుల పాటు ఐసోలేషన్‌లో వుండిపోవాలన్న భయంతో చాలామంది కరోనా విషయాన్ని బయటపెట్టడంలేదు. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగానూ వుంది. అయితే, అధికారిక లెక్కల ప్రకారంగా చూసుకున్నా, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే వుంది. కర్ఫ్యూ మరింత పకడ్బందీగా అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తగు రీతిలో నిర్ణయాలు తీసుకోలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది.

 

తెలంగాణలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల లోపే వుంది. కానీ, తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. కేవలం 4 గంటల పాటు మాత్రమే, ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు.. అదీ నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళ కోసం అనుమతిస్తున్నారు. మొత్తమ్మీద, కరోనా తగ్గుముఖం పడుతోందంటూ ప్రభుత్వం చెప్పుకున్నా, అధికార పార్టీ అనుకూల మీడియాలో కథనాలొస్తున్నా.. అది సమస్యను పక్కదారి పట్టించినట్లేనని విమర్శిస్తోన్న విపక్షాల వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. రోజువారీ మరణాల సంఖ్య 100కి పైగా నమోదవుతుండడం మరింత ఆందోళనకరం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...