Switch to English

స్వర్గీయ ఎన్టీయార్‌కి భారతరత్న ఎందుకు ఇవ్వడంలేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఎవరెవరికో భారతరత్న పురస్కారం దక్కుతోంది. అలాగని, ఆయా వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడలేం. కానీ, స్వర్గీయ నందమూరి తారకరామారావుకి ఎందుకు భారతరత్న ఇవ్వడంలేదు.? అన్నదే కీలకమైన ప్రశ్న ఇక్కడ. స్వర్గీయ ఎన్టీయార్.. పరిచయం అక్కర్లేని పేరిది. తెలుగునాట రాముడన్నా, కృష్ణుడన్నా ఎన్టీయార్ మాత్రమేననేంతలా ఆయన నటించిన పౌరాణిక సినిమాలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మహానటుడు ఎన్టీయార్, రాజకీయ రంగంపైనా తనదైన ముద్ర వేశారు. సొంతంగా పార్టీ పెట్టి, తెలుగునాట అధికారంలోకి రావడమే కాదు, దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అలాంటి స్వర్గీయ నందమూరి తారకరామారావుకి భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించుకోవడం మనందరి భాధ్యత.. అంటారు ఆయన అభిమానులు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఆయన్ని అభిమానించేవారు ఎప్పటికీ వుంటారు. అంతటి మహనీయుడికి భారతరత్న ఎందుకు దక్కడంలేదు.?

 

జయంతికి, వర్ధంతికి మాత్రమే ‘ఎన్టీయార్‌కి భారతరత్న ఇవ్వాలి’ అనే డిమాండ్ తెరపైకొచ్చి, ఆ తర్వాత ఆ విషయాన్ని అంతా ఎందుకు మర్చిపోతుంటారు.? నిజానికి, ఎన్టీయార్ కుటుంబ సభ్యుల్లో చాలామంది రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబు కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు.. టీడీపీ ప్రస్తుత అధినేత ఆయనే. ముఖ్యమంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి రికార్డు కాలం పాటు పనిచేశారు. 13 జిల్లాల ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పినప్పుడు చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీయార్‌కి భారతరత్న కోసం పోరాడలేదన్న విమర్శ వుంది. స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె పురంధరీశ్వరిక గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం స్వర్గీయ ఎన్టీయార్ మరో తనయుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 

అయినా, ఎవరూ చేయాల్సిన స్థాయిలో పోరాటం చేయలేదు స్వర్గీయ ఎన్టీయార్‌కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌తో. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే స్వర్గీయ ఎన్టీయార్ టీడీపీని స్థాపించారో, ఆ కాంగ్రెస్ పార్టీ కూడా పలు సందర్భాల్లో ఎన్టీయార్ ఘనతల గురించి మాట్లాడింది. బీజేపీ సంగతి సరే సరి. జాతీయ పార్టీలు సైతం స్వర్గీయ ఎన్టీయార్‌ని కీర్తిస్తాయిగానీ, ఆయనకు మాత్రం భారతరత్న ఇచ్చేందుకు తమ హయాంలో ప్రయత్నించవు. ఎందుకు.? తెలుగువాడనే చిన్నచూపా.? అంతకన్నా ఇంకేమైనా ప్రత్యేక కారణాలున్నాయా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...