Switch to English

అమరావతి ఉద్యమం @500: భూములివ్వడమే నేరం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

ఇలాంటి నేరం ఇంకే రైతూ దేశంలో చెయ్యకూడదుగాక చెయ్యకూడదు. తనకున్న భూమిలో పంటలు పండించుకోవచ్చు.. పంటలు పండించుకోలేకపోతే, రియల్ ఎస్టేట్ కోసం భూముల్ని అమ్మేసుకోవచ్చు. అంతేగానీ, రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇవ్వడమేంటి.? ఔను, ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు భూములు ఇవ్వడం నేరమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

నేరం చేశారు కాబట్టి, శిక్ష పడాల్సిందే. శిక్ష అనుభవిస్తున్నారు. 500 రోజులుగా అమరావతి కోసం రైతులు ఉద్యమించాల్సి వస్తే, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందినవారెవరూ స్పందించకపోవడాన్ని శిక్షగా కాకపోతే, ఇంకెలా అభివర్ణించాలి.? రైతులు, తమ భూముల్ని ఎవర్ని ఉద్ధరించడానికి ఇచ్చారు.? ఎవరి కోసం ఇచ్చారు.? అమ్మేసుకుంటే, మంచి ధర వచ్చేదే.. రాజధాని నిర్ణయంతో. కానీ, రైతులు అలా చేయలేదు. ప్రభుత్వం చెప్పిన మాటల్ని నమ్మారు. కానీ, ఆ ప్రభుత్వమే తమను మోసం చేస్తుందని ఆలోచించలేకపోయారు.

ఐదేళ్ళకోసారి ప్రభుత్వంలో వున్నవారు మారిపోతే, రాజధాని కూడా మారిపోతుందని పాపం వాళ్ళెవరికీ తెలియదు. అధికారంలో వున్నోడికి నచ్చినన్ని రాజధానులు, నచ్చిన చోట పెట్టుకోవచ్చని ఊహించలేకపోయారు. ఫలితం, రాజధాని అమరావతి అనాధగా మిగిలిపోయింది. ఆ అనాధ కోసం, రైతులు ఉద్యమిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళా రైతులు, 500 రోజులుగా ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. లాఠీల కాఠిన్యం, కర్కశత్వం చూపించినా, రక్తం చిందించారు తప్ప ఉద్యమం నుంచి వెనక్కి తగ్గలేదు. బలనన్మరణాలు, మానసిక ఆవేదనతో చోటు చేసుకున్న అర్ధాంతర చావులు.. ఇలా చాలానే జరిగాయి గడచిన 500 రోజుల్లో, అమరావతి కోసం. ఇవేవీ పాలకుల్ని కదిలించలేకపోయాయి.

హైద్రాబాద్ వేదికగా ఒక్కరోజు దీక్ష చేసిన షర్మిల, తన దీక్షను పోలీసులు భగ్నం చేస్తే, తెలంగాణ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. ఇలాంటి చర్యలతో ఉద్యమాల్ని అణచివేయలేరంటూ తెలంగాణ ప్రభుత్వంపై విజయమ్మ కూడా మండిపడిపోయారు. మరి, అమరావతి కోసం ఉద్యమించిన మహిళా రైతులు ఏమనాలి.? వారి ఆవేదన, ఓ తల్లిగా విజయమ్మను ఎందుకు కదలించలేకపోయింది.?

అమరావతికి టీడీపీనే కాదు, వైఎస్సార్సీపీ కూడా మద్దతిచ్చింది. అధికారంలోకి రాగానే వైసీపీ మాట తప్పింది. మూడు రాజధానుల పేరుతో ఏకైక రాజధాని అమరావతిని ముక్కలు చేయాలని చూస్తోంది జగన్ సర్కార్. ఓ వైపు న్యాయ పోరాటం, ఇంకో వైపు రోజువారీ నిరసనలు, ఆందోళనలు.. వెరసి, 500 రోజులుగా అమరావతి కోసం ధైర్యంగా నిలబడ్డ రైతులకు ‘సెల్యూట్’ చేసి తీరాల్సిందే.

ఒక కాకి చచ్చిపోతే, వంద కాకులు గుమికూడతాయి. కానీ, రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు ప్రాణ త్యాగాలు చేస్తోంటే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలెవరూ అటువైపు చూడటంలేదు. ఔను, అమరావతి కోసం.. కాదు కాదు, రాష్ట్రం కోసం.. తమ భూముల్ని ఇవ్వడమే రైతులు చేసిన నేరం. ఆ నేరానికి శిక్ష అనుభవించాల్సిందే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...