Switch to English

మోహన్ లాల్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ – థ్రిల్స్ తో అదరగొట్టిన సీక్వెల్.!

Critic Rating
( 3.00 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow
Movie దృశ్యం 2
Star Cast మోహన్ లాల్, మీనా, అన్సిబ హాసన్, ఎస్తర్ అనిల్
Director జీతూ జోసెఫ్
Producer ఆంటోనీ పెరుంబవూర్
Music అనిల్ జాన్సన్
Run Time 2 గంటల 33 నిమిషాలు
Release ఫిబ్రవరి 19, 2021

మళయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ అయినా సినిమా దృశ్యం. ఆ తర్వాత ఆ సినిమా సౌత్ అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా రీమేక్ అయ్యి అన్ని చోట్లా సూపర్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా చేసిన దృశ్యం 2 థియేటర్స్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేశారు. మరి ఈ సీక్వెల్ దృశ్యం కన్నా మించి ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ:

‘దృశ్యం’ కథ ఎక్కడ ముగిసిందో అక్కడే కథ మొదలవుతుంది.. వరుణ్ మర్డర్ కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడం వలన జార్జ్ కుట్టి(మోహన్ లాల్) ఫ్యామిలీ ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకుంటారు. అది జరిగిన 6 సంవత్సరాల తర్వాత దృశ్యం 2 మొదలవుతుంది. జార్జ్ కుట్టి తన ఫ్యామిలీతో హ్యాపీ గా ఉంటాడు. మరోవైపు పోలీసులు సీక్రెట్ గా వరుణ్ కేసుని డీల్ చేస్తూ, జార్జ్ కుట్టి ఫ్యామిలీని ఓ కంట కనిపెడుతూ ఉంటారు. ఫైనల్ గా పోలీసులు వరుణ్ బాడీ ఎక్కడ ఉందో కనుక్కొని జార్జ్ కుట్టిని అరెస్ట్ చేస్తారు. అలా అరెస్టైన జార్జ్ కుట్టి మీద కోర్టులో నేరం ఋజువైందా? లేదా? జార్జ్ కుట్టి అప్పటికే తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం వేరే ప్లాన్ లో ఉన్నాడా? అనే ప్రశ్నలకి సమాధానమే దృశ్యం 2 కథ.

తెరమీద స్టార్స్..

మోహన్ లాల్ తనలోని నటున్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ‘దృశ్యం 2’. ఫ్యామిలీ మాన్ గా ఎమోషన్స్ చూపించడంలో, తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎత్తులు వేసే మాస్టర్ మైండ్ లా, అన్నీ వింటున్నా వినపడని అమాయకుడిలా.. ఇలా ప్రతి సీన్ లో తన నటనతో అదరగొట్టాడు. మీనా తన పాత్రలో బాగా అంటించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో మరోసారి మార్కులు కొట్టేసింది. ఐజి పాత్రలో చేసిన మురళి గోపీ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సపోర్టింగ్ రోల్స్ చేసిన అన్సిబ హాసన్, ఎస్తర్ అనిల్, ఆశ శరత్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేసి సినిమాకి బిగ్గెస్ట్ హెల్ప్ అయ్యారు.

తెర వెనుక టాలెంట్..

తెరపై కనిపించిన దానికంటే ఇంకో 50% ఎక్స్ట్రా బ్రిలియన్స్ టెక్నికల్ టీంలో కనపడింది. ముందుగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి సీక్వెల్ చేయడం అనేది బిగ్గెస్ట్ రిస్క్.. అందులోనూ థ్రిల్లర్ జానర్లో, ఫస్ట్ పార్ట్ కి మించిన థ్రిల్స్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన వండర్ ఈ దృశ్యం 2. ఈ విషయంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన జీతు జోసెఫ్ కి వెళ్తుంది. సెకండాఫ్ లోమోహన్ లాల్ ఫామిలీ ఇంటరాగేషన్ దగ్గర నుంచీ సినిమాని తీసుకెళ్లిన తీరు, ఇచ్చిన థ్రిల్స్ చూసే ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. కథ పరంగా చూసుకుంటే థ్రిల్స్ అదిరిపోయాయి కానీ డీటైలింగ్ మరీ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. చివరి 40 నిమిషాల్లో రివీల్ చేసే మలుపుల కోసం దాదాపు గంటన్నర వరకూ అసలు కథలోకి వెళ్లరు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో గా సాగుతుంది. చివరి 40 నిమిషాలు మంచి కిక్ ఇచ్చినా అప్పటి వరకూ సినిమాని చాలా ఓర్పుగా భరించాలి.. అది చాలా కష్టం. సినిమా అంతా అయ్యాక ఇంత మంచి థ్రిల్స్, ప్లే పెట్టుకొని ఎందుకు చివరి వరకూ లాగారు.. ముందు నుంచే ఇంకాస్త ఆసక్తిగా చెప్పి ఉండచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది.

ఇక సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లొకేషన్స్, షాట్ మేకింగ్, విజువల్స్ కలరింగ్ ఇలా అన్నీ అదిరిపోయాయి. అనిల్ జాన్సన్ మ్యూజిక్ కూడా సినిమాలో ఆడియన్స్ డీవియేట్ అవ్వకుండా ఉండేలా చాలా బాగా చేసాడు. వైఎస్ వినాయక్ ఎడిటింగ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త స్పీడ్ గా చెప్పి ఉంటే బాగుండేది. ఆంటోనీ పెరుంబవూర్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– మోహన్ లాల్ మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్
– రేకెత్తించే చివరి 40 నిమిషాలు
– అదిరిపోయే థ్రిల్స్
– సూపర్బ్ విజువల్స్ అండ్ మ్యూజిక్
– పిచ్చెక్కించే క్లైమాక్స్

బోరింగ్ మోమెంట్స్:

– బాబోయ్ అనిపించే ఫస్ట్ హాఫ్
– స్లో నేరేషన్
– చాలా లేట్ గా కథలోకి రావడం

విశ్లేషణ:

బ్లాక్ బస్టర్ ‘దృశ్యం’ సినిమాకి మించిన థ్రిల్స్ తో, ఇంతకన్నా బెస్ట్ సీక్వెల్ తియ్యలేరేమో అనిపించే లాంటి సినిమా ‘దృశ్యం 2’. ఫస్ట్ హాఫ్ పరంగా సాగదీసి బోర్ కొట్టిస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగించినా చివరి 40 నిమిషాల్లో వచ్చే థ్రిల్స్ అండ్ ఎమోషన్స్ ని ప్రేక్షకులు హాయ్ ఫీలవుతారు. థియేటర్స్ మిస్ చేయడం వలన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మిస్ అయ్యాయి అని చెప్పచ్చు.

చూడాలా? వద్దా?: తప్పకుండా చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 3/5 

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...